RRRలో కీలక పాత్రలో తమిళ దర్శకుడు.. ఖరారైనట్లే!
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. రాంచరణ్, ఎన్టీఆర్ మినహా ఈ చిత్రంలో నటించే మిగిలిన నటుల వివరాలని రాజమౌళి ఇంకా ప్రకటించలేదు. ఆ మధ్యన తమిళ దర్శకుడు, నటుడు అయిన సముద్రఖని ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమే అనే సమాచారం సినీ వర్గాల నుంచి అందుకుతోంది.
సముద్రఖని ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీలక పాత్రలో నటించనుండడం ఖాయమేనట. సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. రఘువరన్ బిటెక్ చిత్రంలో సముద్రఖని ధనుష్ తండ్రి పాత్రలో నటించారు.రాజమౌళి చిత్రంలో హీరో హీరోయిన్లు మాత్రమే కాదు.. మిగిలిన పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఎన్టీఆర్, చరణ్ తర్వాత నటుడిగా సముద్రఖని పేరు వినిపిస్తోందంటే ఈ చిత్రంలో ఆయన పోషించే పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర సమర నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర రెండవ షెడ్యూల్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.


Click it and Unblock the Notifications











