ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. షాక్‌లో విజయ్ సేతుపతి
తమిళ సినీ రంగంలో ప్రముఖ దర్శకుడు ఎస్పీ జనంథాన్ ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం (మార్చి 14) ఉదయం 10.07 గంటలకు చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి విజయ్ సేతుపతి, జయం రవితోపాటు తమిళ సినీ పరిశ్రమ, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఐసీయూలో చికిత్స పొందుతున్న జనంథాన్ కు గుండెపోటు వచ్చింది. ఆయన ప్రాణాలు కాపాడటానికి అన్ని విధాల ప్రయత్నించాం. కానీ చికిత్సకు స్పందించలేదు. ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ అయింది అని వైద్యులు తెలిపారు.

జనంథాన్ కెరీర్ విషయానికి వస్తే.. అరుణ్ విజయ్, షామ్‌తో రూపొందించిన ఇయార్కై చిత్రంతో కోలీవుడ్‌లోకి ప్రవేశించాడు. తొలి చిత్రంతోనే జాతీయ అవార్డుతోపాటు పలు అవార్డులను దక్కించుకొన్నారు. ఆ తర్వాత ఈ, పెరాన్మై, పురంపొక్కు ఎనమ్ పొదువుదమై చిత్రాలను తెరక్కించారు.
తాజాగా విజయ్ సేతుపతి, శృతిహాసన్‌తో లాభం అనే చిత్రాన్ని జనంథాన్ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకొంటున్నది. ఇటీవల రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
జోనాథన్ ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్త తెలుసుకొన్న విజయ్ సేతుపతి దిండిగల్‌లో ప్రారంభం కావాల్సిన తన కొత్త సినిమాను వాయిదా వేశారు. చెన్నైకి తిరిగి వచ్చి జనంథాన్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. అయితే తనకు ఇష్టమైన దర్శకుడు కన్నుమూతతో విజయ్ సేతుపతి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.


Click it and Unblock the Notifications











