Ayalaan Trailer Review సూపర్ హీరో ఏలియన్ వచ్చేశాడు... హాలీవుడ్ రేంజ్‌లో ఉందిగా!

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అయలాన్. ఇక ఈ సినిమా సైన్స్‌ ఫిక్షన్ బ్యాక్‌ డ్రాప్‌లో ఆర్. రవికుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆ వివరాల్లోకి వెళితే....

శివ కార్తికేయన్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయి సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక ఈ హీరో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం 'అయలాన్‌'. ఈ సినిమా సైన్స్‌ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. ఇక ఈ మూవీని ఆర్‌.రవికుమార్ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. సంక్రాంతి కానుక‌గా జనవరి 12న పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా నుంచి వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్‌లకు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆదరణ వ‌చ్చింది. ఇదిలా వుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైల‌ర్ రిలీజ్ అయింది. అసలు అయలాన్ అంటే ఏలియన్ అని అర్థం. ట్రైలర్ కూల్ అండ్ నేచురల్ విజువల్స్ తో ప్రారంభం అవుతుంది. ఈ భూమి అన్ని జీవరాశులకు సొంతం అని నాన్న చెప్పిన మాటలను నేను నమ్ముతాను అంటూ శివకార్తీకేయన్ చెప్పడంతో ఈ ట్రైలర్ మొదలు అవుతుంది.

అద్భతమైన విజువల్స్ చూపిస్తూ.. సాగిస్తుండగా.. సడెన్ గా ఒక ఏలియన్ వస్తుంది. హీరో లైఫ్ లోకి ఏలియన్ వచ్చాక ఆయన లైఫ్ ఎలా మారింది.. ఏలియన్ తో కలిసి శివకార్తికేయన్ చేసిన సందడి.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇక ఏలియన్ చేసే కామెడీ చేష్టలు ఆకట్టుకుంటున్నాయి. మామూలుగా అమెరికాను అంతం చేయడానికే కదా వెళ్తారు.. ఇప్పుడు మా దేశానికి వచ్చారేంట్రా అంటూ శివకార్తికేయన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. విలన్ సృష్టించే విధ్వంసాన్ని... ఏలియన్ తో కలిసి హీరో ఎలా అరికట్టాడు అనేది కథాంశం అని తెలుస్తోంది.

Tamil Hero Sivakarthikeyan Ayalaan Movie Trailer Released And Full Review Here

ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ డ్రాప్ లో తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక ఏలియన్ కు తోడుగా నిలిచిన హీరో... ఏం చేశాడు.. అనేది తెలియాలంటే.. సినిమా చూడాలి. ఇక ట్రైలర్ చూస్తుంటే.. కామెడీ, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ తో కూడిన ఎంటర్ టైనర్ అని అర్థం అవుతుంది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఇక తమిళ్ అయలాన్ సినిమాలో ఏలియన్ కు వాయిస్ ఓవర్ సిద్ధార్థ్ అందించారు.

ఇక అయలాన్ సినిమా విషయానికి వస్తే... సైన్స్ ఫిక్షన్ జాన‌ర్‌లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏ.ఆర్‌.రెహమాన్ సంగీతం అందిస్తుండగా... పొంగళ్‌ (సంక్రాంతి) 2024 కానుకగా విడుదల చేయనున్నట్టు మేక‌ర్స్ ప్రకటించారు మేకర్స్. ఇషా కొప్పికర్, శరద్‌ కేల్కర్‌, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్‌, బాల శరవణన్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X