Salaar: సలార్ సినిమాలో హీరో విశాల్ వదిన.. ఏ పాత్రలో కనిపించిందో ట్రైలర్‌లో గమనించారా?
యంగ్ రెబల్ స్టార్, ఆరడుగుల అందగాడు.. అమ్మాయిల మనసుల్లో చెరగని ముద్రు వేసుకున్న డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం వరుస ఫ్లాపులతో తెగ ఇబ్బంది పడుతున్నాడు. అయినా దర్శక, నిర్మాతలు మాత్రం ఆయనకు ఉన్న క్రేజ్ తో భారీ బడ్జెట్ తో చిత్రాలను తీస్తున్నారు. వరుస ఫ్లాపులు వచ్చినా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. అయితే తాజాగా ఈయన సలార్ సినిమాలో నటించారు.
ముఖ్యంగా కేజీఎఫ్ ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది. దేశ వ్యాప్తంగా ప్రభాస్ సినిమా కోసం అభిమానులు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ కు కూడా విశేష స్పందన వచ్చింది. ట్రైలర్ రిలీజ్ అయిన వారం రోజులుకు... అందులో నటించిన వారికి సంబంధించిన వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా తమిళ హీరో విశాల్ వదిన నటించబోతున్నట్లు గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా మరోసారి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తమిళ హీరో విశాల్ వదిన అయిన శ్రియా రెడ్డి ఈ సినిమాలో నటించిందని ట్రైలర్ ను నిశితంగా చూసిన వాళ్లకు తెలిసిపోయింది. అయితే శ్రియా రెడ్డి ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ లో నటించింది, ఎలా కనిపించబోతుందో కూడా ట్రైలర్ లో చూపించారు. కానీ అసలు ఆమెపైకి ఎవరి కన్నూ మళ్లకుండా మాయ చేసేశారు డైరెక్టర్. విశాల్ వదిన ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ లో కనిపించింది. ఎలాంటి లుక్ లో దర్శనం ఇచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రైలర్ మధ్యలో కేవలం రెండు షాట్స్ లోనే శ్రియా రెడ్డి క్యారెక్టర్ ను రివీల్ చేశారు డైరెక్టర్. ఆమె కట్టు బొట్టు చూస్తుంటే చాలా పవర్ ఫుల్ ఉమెన్ గా అనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాలో పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అది నిజమో కాదో తెలియదు కానీ ట్రైలర్ చూస్తుంటే మాత్రం అలాగే అనిపిస్తోంది. మొత్తానికి ఆమె పాత్ర అత్యంత పవర్ ఫుల్ గా ఉండడంతో పాటు ఎక్కువ సేపే ఆమె కనిపించబోతున్నట్లు అర్థం అవుతుంది. నిజ జీవితంలో 40 ఏళ్ల వయసు కల్గిన శ్రియారెడ్డి 2002 నుంచి సినిమాల్లో నటిస్తోంది.

ఇప్పటికీ అద్భుతమైన సినిమాల్లో కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హీరో విశాల్ సోదరుడు విక్రమ్ ను పెళ్లి చేసుకున్న ఈమె ఇప్పటికీ హీరోయిన్ గా రాణిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో.. అదీ అద్భుతమైన రోల్ లో కనిపించబోతుండడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరగనుంది అనేది. డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమా చూస్తే తప్ప శ్రియారెడ్డి క్యారెక్టర్ ఎలా ఉంది, ఆమె నటనతో అందరినీ మెప్పించిందా లేదా అనేది తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











