Vijay- Trisha: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం.. విజయ్ ఇంటికి త్రిష
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన తమిళనాడు ఎన్నికలు రాజకీయ విశ్లేషకులకు, ప్రజలకు ఊహించని షాకిచ్చాయి. డీఎంకే మరోసారి అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ ఫలితాలను తారుమారు చేస్తూ.. ఎవరూ ఊహించని విధంగా కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ స్థాపించిన టీవీకే ప్రభంజనం సృష్టించింది. దాదాపు 110కి స్థానాల్లో విజయం సాధించి అధికారానికి దగ్గరైంది. అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 118 కాగా.. కొన్ని పార్టీల మద్ధతు కూడగట్టడమో లేదంటే అన్నాడీఎంకే మద్ధతుతోనో దళపతి విజయ్ పవర్‌లోకి రావడం లాంఛనమే. ఇదే సమయంలో త్రిష వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ట్రెండింగ్‌లో త్రిష
విజయ్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఎన్నికల ఫలితాల వరకు తమిళ రాజకీయాల్లో సినీ నటి త్రిష హాట్ టాపిక్‌గా మారారు. ఇప్పుడు టీవీకే ప్రభంజనం నేపథ్యంలో త్రిష ట్రెండింగ్‌లో కొనసాగుతున్నారు. త్రిష- విజయ్‌ల మధ్య ఉన్న స్నేహాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్ధులు విజయ్‌ని ఇరుకున పెట్టాలని చూశారు. త్రిష ఇంటి నుంచి బయటకు వస్తేనే విజయ్‌కి రాజకీయాలు తెలుస్తాయంటూ బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనికి సినీ పరిశ్రమతో పాటు ప్రజల నుంచి విమర్శలు రావడంతో త్రిషకు నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు.

పెళ్లిలో జంటగా త్రిష- విజయ్
ఇది సద్దుమణిగిన కొద్దిరోజులకే విజయ్ సతీమణి సంగీత.. తనకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. విజయ్‌కి సినీరంగానికి చెందిన ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని, తన భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, కనీసం ఇంట్లోకి కూడా రానివ్వడం లేదంటూ సంగీత ఆరోపించడం అనేక అనుమానాలకు తావిచ్చాయి. దీంతో అందరి వేళ్లూ త్రిషవైపే చూపించాయి. ఇదే సమయంలో త్రిష- విజయ్‌లు జంటగా ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది.
కేడర్‌కి విజయ్ దిశానిర్దేశం
త్రిషతో సంబంధమంటూ రూమర్స్, సంగీత విడాకుల కేసులను అడ్డుపెట్టుకుని విజయ్‌ని ప్రత్యర్ధులు టార్గెట్ చేశారు. కానీ తన వ్యక్తిగత జీవితం గురించి నేను చూసుకుంటాను. మీరు ఎన్నికలు, ప్రజా సమస్యల పరిష్కారం గురించి చూసుకోమని కేడర్‌కు విజయ్ దిశానిర్దేశం చేశారు. అధినేత ఆదేశాల మేరకు టీవీకే కేడర్ ఎన్నికలు, ప్రచారంపై ఫోకస్ చేసి చారిత్రాత్మక గెలుపుని విజయ్‌కి కట్టబెట్టారు.
విజయ్ ఇంటికి త్రిష
మే 4న ఉదయం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల లెక్కింపు కావడంతో త్రిష.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కోసమే త్రిష వెంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారని రూమర్స్ వచ్చాయి. కానీ త్రిష మాత్రం మీడియాకు నవ్వుతూ, అభివాదం చేస్తూ వెళ్లిపోయింది. పుట్టినరోజు కావడంతోనే త్రిష తిరుమలకు వెళ్లారని ఆమె అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు. తిరుమల నుంచి నేరుగా చెన్నైలోని దళపతి విజయ్ నివాసానికి చేరుకున్నారు త్రిష. ఎన్నికల్లో విజయ్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఇప్పటికే టీవీకే అభిమానులు, కార్యకర్తలు విజయ్ నివాసం వద్ద సందడి చేస్తున్నారు. ఇప్పుడు త్రిష కూడా విజయ్ ఇంట్లోనే ఉండటం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications