పవన్ కల్యాణ్ దారిలో దళపతి విజయ్.. తమిళ రాజకీయాల్లో సంచలనం దిశగా!

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు ఇప్పటికే పొత్తులు, సీట్ల పంపకాలు పూర్తి చేసి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం అందరిచూపు టీవీకే అధినేత, దళపతి విజయ్ మీదే ఉంది. ఎవరితోనూ పొత్తుల్లో కలవకుండా, ఒంటరిగానే పోటీ చేయాలని దళపతి నిర్ణయించుకున్నారు. దాంతో విజయ్ పార్టీ నుంచి అభ్యర్ధుల జాబితా వెలువడుతుందా? రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో విజయ్ పోటీ చేస్తారా? తన బలం ఉన్న స్థానాల్లోనే బరిలోకి దిగుతారా? అని రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూశాయి. ఈ ఉత్కంఠకు విజయ్ చెక్ పెట్టారు.

30 ఏళ్ల సినీ కెరీర్‌ను వదులుకుని, తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు దళపతి విజయ్. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలపై తనవాడి వేడి విమర్శలతో ఎక్కుపెట్టారు. విజయ్‌ ఛరిష్మా, ఫ్యాన్స్ బేస్‌ గురించి బాగా తెలిసిన కాంగ్రెస్, బీజేపీలు ఆయనను తమ కూటమిలోకి లాగాలని ప్రయత్నించాయి. బీజేపీ అయితే ఏకంగా 80 అసెంబ్లీ స్థానాలు, డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. కానీ దళపతి మాత్రం దానిని సున్నితంగా తిరస్కరించారు.

Tamil Nadu Polls 2026 TVK Announces Candidates list and Thalapathy Vijay To Contest 2 Seats

కాంగ్రెస్ పార్టీ కూడా తనకు తెలిసిన మార్గాల్లో విజ‌య్‌ని దువ్వాలని గట్టిగానే ట్రై చేసింది. ఒకనొక దశలో కాంగ్రెస్‌తో దళపతి పొత్తు పెట్టుకున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత అది గాలివార్తలుగా నిలిచిపోయాయి. ఇక పొత్తులు పెట్టుకునే అవకాశం కూడా లేకపోవడంతో విజయ్ ఒంటరిగా మిగిలిపోయారు. చివరికి విజయ్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? అసలు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉందా? లేదా? అంటూ రాజకీయ ప్రత్యర్ధులు విమర్శలు చేశారు. వీటన్నింటికీ చెక్ పెట్టారు దళపతి విజయ్.

అభ్యర్ధుల ఎంపికపై లోతుగా కసరత్తు చేశారు విజయ్. తమిళనాడులోని 234 స్థానాలు, పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే అభ్యర్ధుల జాబితాను దళపతి విజయ్ ప్రకటించారు. మార్చి 29వ తేదీన చెన్నైలోని ఓ హోటల్‌లో జరిగిన టీవీకే రాష్ట్ర స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా దళపతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా దళపతి ఉద్వేగంగా ప్రసంగించారు. తన అభ్యర్ధులు రాజకీయ దిగ్గజాలు కాదని.. వారికి ప్రజలే అండగా నిలవాలి. ఈ ఎన్నికల్లో డీఎంకేతోనే టీవీకేకు పోటీ ఉంది. విజిల్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి. రాష్ట్ర శ్రేయస్సు కోసం టీవీకేకు ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయం.. అవినీతికి పాల్పడమని దళపతి హామీ ఇచ్చారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అభ్యర్ధుల ప్రకటన.. విజయ్ రెండు చోట్ల పోటీ అన్నది హాట్ టాపిక్‌గా మారింది. మరి ప్రచారంలో డీఎంకే, అన్నాడీఎంకేలను దళపతి ఏ మేరకు ఎదుర్కొంటారో చూడాలి. అలాగే విజయ్‌ను ఓడించడానికి సీఎం ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిలు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి.

Read more about: tvk thalapathy vijay tamilnadu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X