విజయ్ దేవరకొండకు తమిళ నిర్మాత క్షమాపణ.. అసలేం జరిగిందంటే..

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు తమిళ నిర్మాత క్షమాపణలు చెప్పారు. ఓ సినిమా ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం జరిగిన నేపథ్యంలో తమిళ నిర్మాణ సంస్థ డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తరఫఉన నిర్మాత బాలా సెంథిల్ కుమార్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ సినిమా విషయంలో చోటుచేసుకొన్న రూమర్ల విషయంలో మాకు సంబంధం లేకుండానే ప్రచారం అయ్యాయని పేర్కొన్నారు.

తమిళ సినిమాకు సంబంధించిన వివాదంలోకి వెళితే.. తమిళ రంగానికి చెందిన డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన క్రియేటివ్ ప్రొడ్యూసర్ బాల సెంథిల్ కుమార్ ఇటీవల విజయ్ దేవరకొండను ఓ ప్రాజెక్టు కోసం సంప్రదించారు. అయితే సెంథిల్ ప్రతిపాదనను విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించారు. అయితే కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా ఆ ప్రాజెక్టును విజయ్ దేవరకొండ చేస్తున్నారని చెప్పి పలువురు తమిళ హీరోయిన్లతో చర్చలు జరిపినట్టు తమిళ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో విజయ్ దేవరకొండ టీమ్ ఆ విషయంపై నిర్మాతను ఆరా తీసింది. ఆ వార్త వెనుక కారణాలు అడిగి తెలుసుకొన్నారు. అయితే ఆ వార్త మీడియాలో రావడానికి తమకు సంబంధం ఏమీ లేదని స్పష్టం చేశారు.

Tamil Producer Bala Senthil Kumar regrets for Vijay Deverakonda

తమ తరఫున తప్పు జరిగినందున్న డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఓ ప్రాజెక్టు విషయంలో ఫార్మల్‌గా విజయ దేవరకొండను మా క్యాస్టింగ్ ఏజెన్సీ ద్వారా సంప్రదించాం. ఆ తర్వాత మా ప్రాజెక్టు గురించి ఆయన ఇంట్రెస్ట్‌గా లేరని తెలిసింది. అంతవరకు మాత్రమే ఆయన టీమ్‌తో చర్చలు జరిగాయి. అయితే వారితో జరిగిన చర్చలు, ప్రాజెక్టు విషయంలో తప్పుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకు మేము చింతిస్తున్నాం అని ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ వ్యవహారంలో జరిగిన విషయాల పట్ల చింతిస్తున్నాం అని తెలిపారు.

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ టీమ్‌కు చెందిన అనురాగ్ పర్వతనేని స్పందించి ఓ ప్రకటనను విడుదల చేయమని కోరగా, అధికారికంగా డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్ నోటును విడుదల చేసింది. దాంతో ఈ వివాదం సద్దుమణిగేలా చేశారు.

ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండకు తమ డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు జరిగిన వివరాలను తప్పుగా ప్రచారం చేయడంపై స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X