మాస్టర్ అభిమానులకు గుడ్ న్యూస్.. 100% హౌజ్ ఫుల్!

తమిళనాడు ప్రభుత్వం థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీని ఆమోదించింది. నవంబర్ 10 నుండి తమిళనాడు అంతటా థియేటర్లు తిరిగి తెరవబడ్డాయి, అయితే మొన్నటి వరకు 50 శాతం సీటింగ్ సామర్థ్యం వరకే అనుమతులు ఇచ్చారు. కానీ పెద్ద సినిమలేవి కూడా రిలీజ్ కాలేదు. థియేటర్స్ యాజమాన్యాలపై ఆ ఎఫెక్ట్ గట్టిగానే పడింది.

భారీ స్థాయిలో నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో థియేటర్స్ యాజమాన్యం ఇటీవల తమిళ ప్రభుత్వాన్ని కలుసుకుని, సీటింగ్ సామర్థ్యాన్ని పెంచాలనే అభ్యర్థనను ప్రభుత్వం ముందు పెట్టింది. అయినప్పటికీ టిఎన్ ప్రభుత్వం తొందరపడలేదు. ఆరోగ్య శాఖను సంప్రదించిన అనంతరం కోవిడ్ -19 యొక్క రోజువారీ కేసులు తగ్గినట్లు నివేదిక వచ్చిన తరువాతే అనుమతులు ఇవ్వడం జరిగింది.

tamilnadu govt Approves 100 percent Occupancy In Theatres

సీటింగ్ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. రాష్ట్రంలోని అన్ని థియేటర్లు మల్టీప్లెక్స్‌లలో 100 శాతం ప్రేక్షకులను అనుమతించగలవని క్లారిటీ వచ్చేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యల కోసం కొన్ని విషయాల్లో యాజమాన్యం జాగ్రత్తగా ఉండాలని వివరణ ఇచ్చింది. ఇక విజయ్ మాస్టర్ సినిమా ఈ పొంగల్ కు రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా యూనిట్ కూడా ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కలిసి 100 శాతం ప్రేక్షకులను అనుమతించాలని ముందే కోరింది. ఆ డిసిషన్ గురించి తెలుసుకున్న తరువాతే విజయ్ మాస్టర్ రిలీజ్ ఎనౌన్స్మెంట్ ఇచ్చినట్లు టాక్ అయితే వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X