నిశ్శబ్దం సినిమాకు మరో దెబ్బ.. పంజా విసిరిన పైరసీ రక్కసి
దక్షిణాది సూపర్‌స్టార్ అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్దం చిత్రం కొద్ది నెలలుగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్‌లో రిలీజైంది. ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమాపై పైరసీ వెబ్‌సైట్లు పంజా విసిరాయి. ఈ పైరసీ వివరాల్లోకి వెళితే..

నిశ్శబ్దం ఇంటర్నెట్‌లో లీక్
మాధవన్, అనుష్క, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన అమెజాన్‌లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన హెచ్‌డీ ప్రింట్ ఇంటర్నెట్‌లో లీక్ అయింది. దీంతో నిశ్శబ్దం చిత్ర యూనిట్, అమెజాన్ నిర్వాహకులు షాక్‌కు గురైనట్టు సమాచారం.

కొద్ది గంటల్లోనే హెచ్‌డీ వెర్షన్ లీక్
ఇటీవల కాలంలో అన్ని భాషల చిత్రాలను తమిళ రాకర్స్ పైరసీ వెబ్‌సైట్ రిలీజైన కొద్ది గంటల్లోనే తమ వెబ్‌సైట్‌లో పెట్టడం జరుగుతున్నది. పలు భాషలకు సంబంధించిన చిత్ర నిర్మాతలు పలు రకాలుగా ఈ పైరసీని అడ్డుకొనేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజా నిశ్శబ్దం సినిమాపై కూడా తమిళ రాకర్స్ పంజా విసిరింది.

ఓటీటీకి చుక్కలు చూపిస్తున్న తమిళ్ రాకర్స్
గతంలో పైరసీదారుల వల్ల కేవలం నిర్మాతలకు ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే భారీ మొత్తాలతో ఓటీటీ రైట్స్ దక్కించుకొన్న అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జీ5, డీస్నీ హాట్‌స్టార్, ఆహా లాంటి సంస్థలపై తీవ్రమైన ప్రభావం పడుతున్నది. కొద్ది గంటల్లోనే హై రెజల్యూషన్ సినిమాలు తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ లాంటి వెబ్‌సైట్లతో రావడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.
Recommended Video

తమిళ, హిందీ చిత్రాలు కూడా
తాజాగా నిశ్శబ్దం సినిమాపైనే తమిళ్ రాకర్స్, ఇతర పైరసీ వెబ్‌సైట్లు పంజా విసరలేదు. హిందీలో రిలీజైన ఇషాన్ కట్టర్, అనన్య పాండే చిత్రం ఖాళీ పీలీ చిత్రం, తమిళంలో రిలీజైన విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాజేష్ నటించి చిత్రం కా పే రణసింగం చిత్రం కూడా తమిళ రాకర్స్ లీక్ చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications











