twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి, పరువు తీసావ్ కదయ్యా.. ఆ మాత్రం అడుక్కోవాలా ? : తమ్మారెడ్డి సంచలనం!

    |

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చిరంజీవి ఆధ్వర్యంలోని సినీ హీరోలు, దర్శకుల బృందం వెళ్లి చర్చలు జరిపి వచ్చిన సంగతి తెలిసిందే. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన టికెట్ల విషయంలో ఉన్న సమస్యలకు శుభం కార్డు పడినట్లేనని పేర్కొన్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి అలాగే హీరోల బృందం మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మీడియాకు కొన్ని వీడియోలు విడుదలయ్యాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి చేతులు జోడించి వేడుకుంటున్నట్లు ఉన్న వీడియో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉండగా తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆ వీడియోను ఉద్దేశిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    Tollywood Meets CM YS Jagan, 20 శాతం షూటింగ్ AP లోనే..!| Filmibeat Telugu
     ఎవరినీ యాచించకు

    ఎవరినీ యాచించకు

    చిరంజీవి నేతృత్వంలోని బృందం వెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి వచ్చినందుకు ధన్యవాదాలు అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఎవరు ఎన్ని అన్నా సరే మొదట ఈ సమస్యను పరిష్కరించాలని అడుగు వేసింది చిరంజీవేనని ఆయన వెల్లడించారు. గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ కి మధ్య ఉన్న ఒక సమస్యను పరిష్కారం చేయడానికి చిరంజీవి వేసిన అడుగు బాగా ఉపయోగపడిందని ఆయన అన్నారు. మేమందరం ఆయన సినీ పరిశ్రమకు పెద్ద అని భావిస్తాము కానీ ఆయన బిడ్డ అని అంటూ ఉంటారు. పెద్ద అయినా బిడ్డ అయినా మనకంటూ ఒక ఆత్మ గౌరవం ఉంటుంది. ఎన్టీఆర్ పాట ఎవరికీ తలవంచకు, ఎవరినీ యాచించకు అనే ఒక పాట ఉంటుంది అని ఆ పాటను గుర్తు చేశారు తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పుకొచ్చారు.

    ఇండస్ట్రీకి అనేక సమస్యలు

    ఇండస్ట్రీకి అనేక సమస్యలు

    మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమ తరపున అక్కడకు వెళ్లారు అని ఒకవేళ తెలుగు సినీ పరిశ్రమ తరపున వెళ్లకపోయినా మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకి ఒక చరిష్మా ఉందని అన్నారు. అలాంటి ఆయన సినీ పరిశ్రమ తరపున వెళ్ళినప్పుడు అది మరింత ఎక్కువ అవుతుందని అన్నారు. కానీ లీకైన వీడియో చూస్తే చిరంజీవి అడుక్కుంటున్నట్టు అనిపించిందని తనకు చాలా బాధ వేసింది అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. మనము అలా అడుక్కునే పరిస్థితిలో ఉన్నామా అని అనిపించింది అని ఆయన పేర్కొన్నారు. ఇంతా కష్టపడి అక్కడికి వెళితే జరిగింది ఏమిటి? థియేటర్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. థియేటర్ రేట్లు పెరగడం ఒక్కటే కాదు కదా ఇండస్ట్రీకి అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు.

    తనకు నచ్చలేదని

    తనకు నచ్చలేదని

    ఆ సమస్యల అన్నిటి గురించి మాట్లాడాలి అదనంగా ఐదవ షో కి పర్మిషన్ ఇస్తామన్నారు, అది పర్వాలేదు అలాగే ప్రభుత్వం తరఫున విశాఖపట్నంలో భూములు ఇస్తామన్నారు దానికి కూడా పర్వాలేదు మొత్తం 17 కోరికలతో అజెండా పెట్టుకున్నాం. అయితే వాటిలో ఎన్నింటి గురించి మీరు చర్చించారు అనే విషయం తెలియదు అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయో లేదో తెలియకుండా కేవలం రేట్లు పెంచిన విషయం మీద ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడినట్లేనని చెప్పడం తనకు నచ్చలేదని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ వంటి సినిమాను ఉదాహరణగా చెబుతూ ఒక వేళ ఆంధ్రప్రదేశ్ లో రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినంత మాత్రాన పది పదిహేను కోట్లు మాత్రమే పెరిగే అవకాశం ఉంటుందని ఒక పాన్ వరల్డ్ సినిమాకు పది పదిహేను కోట్లు అనేది నథింగ్ అని చెప్పుకొచ్చారు.

    అడుక్కోవాలా ?

    అడుక్కోవాలా ?

    కేవలం నాన్ థియేట్రికల్ బిజినెస్ మాత్రమే 300 కోట్ల రూపాయల దాకా జరిగి ఉంటాయని అంచనాలు వచ్చాయని థియేట్రికల్ బిజినెస్ 200 కోట్లు జరిగినా ఆపైన 100 కోట్ల రూపాయలు లాభమే కదా అని ప్రశ్నించారు. అసలు సినిమాలు వాయిదా వేస్తున్న పరిస్థితి కేవలం కరోనా కారణంగానే తప్ప రేట్ల విషయంగా కాదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చెప్పిన రేట్ల ప్రకారమే విడుదలైన అఖండ, పుష్ప సినిమాలు సూపర్ హిట్ గా నిలిచినప్పుడు మిగతా సినిమాలు రిలీజ్ చేసి అవి ఎందుకు హిట్ కావు నేడు చూడాలని అన్నారు. పోనీ 20 కోట్లు 25 కోట్లు తేడా వస్తుందని అనుకున్నా వాటి కోసం చిరంజీవి లాంటి పెద్ద హీరోలు వెళ్లి యాచించాలా? అడుక్కోవాలా ? అని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు.

    పరువు తీసావ్ కదయ్యా

    పరువు తీసావ్ కదయ్యా

    ఇండస్ట్రీకి తలమానికంగా ఉన్న చిరంజీవి లాంటి వ్యక్తి వెళ్లి అలా చేయడం తనకు నచ్చలేదని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఆయన వెంట వెళ్లిన వాళ్లు కూడా మామూలు వాళ్ళు కాదని ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి కొరటాల శివ లాంటి పెద్దవారు వెళ్లి ఇలా అడుక్కునే పరిస్థితి లో ఉండటం అనేది తనకు బాధగా ఉందని చెప్పుకొచ్చారు. ముందుగా ఒక పెద్ద మనిషి తరహాలో వెళ్లి సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేసిన చిరంజీవి గారికి ధన్యవాదాలు అని చెబుతూనే అలా ఒదిగిపోయి అడుక్కున్న విధంగా కోరడం తనకు ఏమాత్రం నచ్చలేదని అన్నారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని చెబుతూ ఆయన వీడియో విడుదల చేశారు. దానికి థంబ్ నైల్ గా 'చిరంజీవి పరువు తీసావ్ కదయ్యా' అంటూ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

    English summary
    Tammareddy Bharadwaj made sensational comments on Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X