twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి రోజూ చేసే సాయం ఎన్ని లక్షలంటే..నాకెందుకు అంటూనే అండగా, నిద్రపోతున్నారు అనే వాళ్ళ కోసమే లెక్కలు!

    |

    మెగాస్టార్ ఆర్థిక సాయం అనే విషయం కరోనా రెండో దశ మహమ్మారి విజృంభించిన తర్వాత తెరమీదకు వచ్చింది. చాలామంది సోషల్ మీడియాలో సోనూ సూద్ మెగాస్టార్ చిరంజీవి సాయాన్ని పోలుస్తూ సోనూ చేస్తున్న సేవలలో కొంత భాగం కూడా చిరంజీవి చేయడం లేదు అన్నట్లు అప్పట్లో కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఆయన ఆక్సిజన్ బ్యాంకు స్థాపించగా వాటి మీద కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే గత కొద్ది రోజులుగా చిరంజీవి రోజుకు లక్షల రూపాయల సాయంగా అందిస్తారు అనే విషయం హైలెట్ గా నిలుస్తుంది. ఈ విషయం మీద తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    రెండు సినిమాలు

    రెండు సినిమాలు

    తనకు చిరంజీవి ప్రాణం ఖరీదు అనే సినిమా చేసినప్పటి నుంచి పరిచయం అని తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. ఆయన ప్రాణం ఖరీదు సినిమా చేసిన తర్వాత ఒక సినిమా చేయాలి అని క్రాంతి గారి ఆఫీస్ కి వెళ్ళినప్పుడు కలిసాడని, అయితే కలవడం అంటే కలవడం కాదని అక్కడ మొట్టమొదటిసారిగా చిరంజీవిని చూశానని చూసి ఆయనతో సినిమా చేయాలని క్రాంతి గారికి చెప్పానని అన్నారు.

    ఒక మలయాళ సినిమా కొని అందులో చిరంజీవి ని హీరోగా పెట్టి చేయాలని అనుకున్నామని అన్నారు. క్రాంతి గారి దగ్గర అప్పటికే ప్రాణం ఖరీదు సినిమా చేశాడు కాబట్టి తమ సినిమా కూడా వెంటనే ఒప్పుకున్నాడని ఆయన అన్నారు. ఆ తర్వాత కోతల రాయుడు తో మొగుడు కావాలి అనే మరో సినిమా చేశారని అప్పటి నుంచి మంచి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండే వాళ్ళు అని అన్నారు.

    నేను ఇలా ఆయన మెగాస్టార్

    నేను ఇలా ఆయన మెగాస్టార్

    ఆ తర్వాత తాను ఇటు పక్కకు వచ్చేస్తే ఆయన మెగాస్టార్ అయిపోయారని అన్నారు. కలవడం అనేది బాగా తగ్గిందని కానీ అప్పుడప్పుడు కలుస్తూనే ఉండేవాళ్లమని ఆయన అన్నారు. తనతో చాలా బాగా ఉండే వాడని తమ మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదని ఆయన అన్నారు. ఈ మధ్యకాలంలో కరోనా వచ్చాక కరోనా క్రైసిస్ చారిటీ అనే ఒక సంస్థను స్థాపించాక మళ్ళీ కలవడం జరిగింది అని, ఆ మధ్య రెండు మూడు సార్లు కలిసినప్పుడు ఇప్పుడు దాసరి నారాయణరావు లేరు కాబట్టి ఆ బాధ్యతలు మీరు తీసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక అండగా ఉండాలని తాను కోరానని అన్నారు. అయితే అప్పుడు మాత్రం నాకెందుకు ఇవన్నీ ఇప్పుడు అవసరమా అని అన్నా సరే ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా చిరంజీవి స్వయంగా అడ్డం నిలబడుతూ వచ్చారు అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

    ఇప్పటివి కాదు

    ఇప్పటివి కాదు

    ఇక ఆయన సేవా కార్యక్రమాలు ఇప్పుడు ప్రత్యేకంగా మొదలుపెట్టినవి కావు అని పేర్కొన్న ఆయన ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితమే బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో మంది ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేశారని అన్నారు. ఇక ఎన్నో గుప్తదానాలు ఆయన చేశారని వాటి గురించి ప్రత్యేకంగా చర్చ కూడా అక్కర్లేదు అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.

    కరోనా క్రైసిస్ చారిటీకి హీరోలు అందరూ దానాలు ఇచ్చినా సరే చిరంజీవి మాత్రం దానిని బాధ్యతగా తీసుకొని పది వేల మంది కార్మికులకు మూడు విడతలుగా నిత్యావసర వస్తువులు కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా అందేలా చేశారని అన్నారు. మరీ ముఖ్యంగా మొదటి సారి అయితే భయంకరమైన కరోనా పరిస్థితుల్లో ఈ నిత్యావసరాలు అందించామని అన్నారు.

    నాలుగైదు లక్షల రూపాయలు దానంగా

    నాలుగైదు లక్షల రూపాయలు దానంగా

    ఇక రెండు రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి వలన ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఆక్సిజన్ బ్యాంకులు స్థాపించారని ఆయన అన్నారు. అలాగే సినీ కార్మికుల కోసం పెద్ద ఎత్తున కరోనా వ్యాక్సిన్ డ్రైవర్ కూడా ఆయన తన బ్లడ్ బ్యాంక్ వేదికగా నిర్వహించాలని అన్నారు. ఇవి కాకుండా తాను గతంలో చూసినవి ఇప్పుడు చూస్తున్నవి, వింటున్నవి ఏమిటంటే ఆయన కనీసం రోజుకు నాలుగైదు లక్షల రూపాయలు దానంగా ఇస్తారు అని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ.

    వచ్చిన వారిని వారి ఇబ్బందుల మేరకు స్పందిస్తూ రెండు లక్షల రూపాయల నుంచి ఆ పైన చెక్కులు రాసి వారికి అండగా నిలబడ్డారని కొన్ని నేను విన్నాను, కొన్ని నా కళ్ళతో చూశాను అని తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు.

    Recommended Video

    Mandakrishna Madiga Responded On 'Palasa 1978' Movie
    గుప్తదానాలు

    గుప్తదానాలు

    అయితే ఈ గుప్తదానాలు అన్నింటికీ ఎక్కడా పబ్లిసిటీ గాని ప్రమోషన్ గాని ఉండదని ఆయన అన్నారు.. అయితే చిరంజీవి ఒక్కడే చేస్తున్నాడు మిగతా హీరోలు దర్శకులు చేయడం లేదు అని తాను అనడం లేదని ఎవరి స్థాయిలో వారు చేస్తూనే ఉంటారు. కానీ చిరంజీవి మాత్రమే నెగిటివిటీ స్ప్రెడ్ అయింది అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నిద్ర పోతుందా ? చిరంజీవి లాంటి హీరోలు ఏం చేస్తున్నారు అని ముందుగా ఆయన ని టార్గెట్ చేస్తున్నారని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.

    ఇక చిరంజీవికి ఎవరి సపోర్టు లేదని ఈ రోజు ఆయన ఫ్యామిలీలో ఎనిమిది మంది హీరోలు ఉండి ఉంటే ఉండొచ్చు గాని ఆయన సింగిల్ గా వచ్చి ఈ స్థాయికి వచ్చి నిలబడ్డారు అని అన్నాడు. అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వీళ్ళందరూ ఉండగా చిరంజీవి వచ్చి నిలబడ్డాడు అంటే గొప్ప విషయమని అన్నారు.

    English summary
    Tammareddy Bharadwaja made some intresting comments on Chiranjeevi’s daily donation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X