దేహి అని అడుక్కోవడం కరెక్ట్ కాదు.. సీఎంతో సీని పెద్దల భేటీపై స్టార్ ప్రొడ్యూసర్ ఫైర్!
Tammareddy Bharadwaja: ఇటీవల టాలీవుడ్లో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా సంధ్యా థియేటర్ ఘటన టాలీవుడ్ పై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. ఈ ఘటన కారణంగా ఇకపై బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వబోమని, టికెట్ రేట్ల పెంపు ఉండబోదంటూ స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తో టాలీవుడ్ లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తో సినీ పెద్దలు భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ పై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మిరెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తో తెలుగు సినిమా ప్రముఖులు గురువారం నాడు భేటీ అయిన విషయం తెలిసిందే. ఇన్ డైరెక్ట్ గా టికెట్ రేట్ల పెంపునకు, బెనిఫిట్ షోల అనుమతికి తెలంగాణ ప్రభుత్వం నిరాకరించిందని చెప్పకనే చెప్పారు. ఈ భేటీ అనంతరం.. ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వార్తలు లో నిలుస్తున్నారు. ఈ తరుణంలో తమ్మిరెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి తో సినీ ప్రముఖుల భేటీ పై తమ్మిరెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడుతూ.. ఇది ప్రభుత్వం పిలిచి మరి ఏర్పాటు చేసిన మీటింగ్ కాదన్నారు. ఆ మీటింగ్ కు తనకు ఆహ్వానం అందలేదని, ఇండస్ట్రీ అంటే చాంబర్ ఒకటే కాదని అన్ని సెక్టార్లను కలిపితేనే ఇండస్ట్రీ అని చెప్పుకొచ్చారు. అన్ని చాంబర్ కిందే ఉంటాయనీ, ఇది చాంబర్ సమావేశం కాదని వెల్లడించారు. పి ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజును పిలవడంతో ఆయన కొంతమందిని మాత్రమే తీసుకువెళ్లారని, సినిమాలు తీసే నిర్మాతలు వాటి పరిష్కారం కోసం వెళ్లారని, బెనిఫిట్ షోలు వద్దని ముందే చెప్పానన్నారు. ఇప్పటికే పుష్ప 2 తో ఏర్పడిన గ్యాప్ పోయిందనీ, అల్లు అర్జున్ సమస్య ముగిసిపోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ ఇప్పటికే ప్రపంచ స్థాయిలో స్థానం సంపాదించుకుందని, తమ దగ్గర అన్ని భాషల సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ఇక్కడ పెట్టాలంటే హైదరాబాదులో ఆఫీసులు ఉండాలని, ఇకపోతే అల్లు అర్జున్ సుకుమార్ గతంలో మంచి సందేశాన్ని ఇచ్చే షార్ట్ ఫిలిమ్స్ చేశారని కూడా వెల్లడించారు. ఎన్టీఆర్, చిరంజీవి కూడా ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ లలో నటించారని గుర్తు చేశారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు సినిమా వాళ్ల నుండి కచ్చితంగా మద్దతు ఉంటుందని, కేవలం సినిమాలు రిలీజ్ అయినప్పుడే కాకుండా.. అవసరమైనప్పుడు కచ్చితంగా తమ అందుబాటులో ఉంటామని తమ్మిరెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.

తమ్మిరెడ్డి భరద్వాజ ఇంకా మాట్లాడుతూ.. టికెట్ రేట్ల పెంపు వల్ల మహా అయితే.. 100 కోట్లు తేడా వస్తోంది. ప్లాప్ సినిమా అయితే.. కలెక్షన్లలో ఎలాంటి తేడా ఉండదు. ఫ్లాప్ సినిమాల విషయంలో టికెట్ రేట్ల ను పెంచినా.. తగ్గించిన ఎలాంటి తేడా ఉండదు. ఇక హిట్ సినిమా విషయంలో టికెట్ల రేట్లు పెంచితే 100 కోట్లు తేడా వస్తుంది కావచ్చు. 1000 కోట్లు వసూలు చేసిన సినిమాకు 100 కోట్లు తగ్గితే.. కొంపే మునగదు. ఎందుకంటే.. ప్రస్తుతం 500 కోట్ల బడ్జెట్ నుంచి సినిమా తీయలేం. ఆ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తే.. 500 కోట్లు లాభం టికెట్లు రేట్లు పెంచకున్న 400 కోట్ల వరకు లాభం వస్తుంది. ఈ లాభంతో మనం సాటిస్ఫై కాలేమా? ఆ భారాన్ని ఆంధ్ర తెలంగాణ ప్రజలపై వేయాల అనేది మనమే ఆలోచించుకోవాలి. దీని కోసం ముఖ్యమంత్రిల దగ్గరికి వెళ్లి దేహి అని అడుక్కోవడం కరెక్ట్ కాదు. గతంలోనూ తన అభిప్రాయాన్ని వెల్లడించాను. ఇప్పుడు కూడా ఈ విషయంపై నా అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాను. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తమ్మిరెడ్డి భరద్వాజ ప్రస్తుతం ఈ వాక్యాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన మాటలకు కొందరు సపోర్ట్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











