RRR ఆస్కార్ గెలుపుపై తమ్మారెడ్డి వివరణ.. మధ్యలో ఎవడో వేలు పెట్టారు అంటూ షాకింగ్ రియాక్షన్..

RRR ఆస్కార్ ప్రమోషన్ కోసం ఏకంగా 80 కోట్లు ఖర్చు పెట్టారంటూ కొద్ది రోజుల క్రితం తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం అయ్యిన సంగతి తెలిసిందే. దీనిపై నాగబాబు కాస్తా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అలాగే మరికొందరు కూడా రియాక్ట్ అయ్యారు. అయితే మళ్ళీ ఆ మాటలకు కౌంటర్ గా తమ్మారెడ్డి ఘాటుగా వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు RRR ఆస్కార్ సాదించడంతో మళ్ళీ తమ్మారెడ్డి భరద్వాజ ఒక వివరణ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

లెక్కలు ఉంటే చెప్పు

లెక్కలు ఉంటే చెప్పు

నీ అమ్మ మొ** 80 కోట్లు ఖర్చు పెట్టాడా అంటూ నాగబాబు తమ్మారెడ్డి కామెంట్స్ కు ఘాటుగా ట్వీట్ చేశారు. రాఘవేంద్రరావు కూడా రియాక్ట్ అయ్యి ఆ 80 కోట్లు ఖర్చు చేసినట్లు నీ దగ్గర లెక్కలు ఉంటే చెప్పు అంటూ ప్రశ్నించారు. ఇక ఆ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యి తమ్మారెడ్డి భరద్వాజ కూడా తిరిగి వారిపై సీరియస్ గా స్పందించారు. ఎవరి లెక్కలో ఏమిటో నాకు తెలుసు అని నేను చెబితే మామూలుగా ఉండదని అన్నారు. అలాగే తాను అనవసరంగా బూతులు మాట్లాడే మనిషిని కాదని కూడా తెలియజేశారు.

మరోసారి తమ్మారెడ్డి వివరణ

మరోసారి తమ్మారెడ్డి వివరణ

నాగబాబుని ని లక్ష్యంగా చేసుకొని ఇదివరకే తమ్మారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అయితే తమ్మారెడ్డి వ్యాఖ్యలపై మరల నాగబాబు రియాక్ట్ కావడం జరిగింది. ఈ ఇష్యూ వారి మధ్య ఇప్పటికి నడుస్తుంది. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కి ఇప్పుడు ఆస్కార్ వచ్చింది. ఈ నేపధ్యంలో మరోసారి తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆయన ప్రత్యేకంగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

 కుటుంబంలో ఒక పెద్దగా

కుటుంబంలో ఒక పెద్దగా

కీరవాణి ఆస్కార్ అందుకోవడం నేను అందుకున్న ఆనందంగా ఉంది. కుటుంబంలో ఒక పెద్దగా ప్రమోషన్స్ కోసం ఖర్చు ఎక్కువ పెడుతున్నారు అని చెప్పాను. కేవలం జాగ్రత్తలు చెప్పడం తప్ప అందులో నాకు వేరే ఉద్దేశ్యం లేదు. మా వాళ్లకి పేరు ప్రతిష్టలు లభిస్తే మా కంటే ఆనందించే వారు ఎవరుంటారు. అయితే ఈ మధ్యలో ఎవడో వేలు పెట్టి ఏదో లబ్ది పొందాలని ట్రై చేశారు.. అని అన్నారు.

వాళ్ళందరికి తెలుసు

వాళ్ళందరికి తెలుసు

నా గురించి వాళ్ళందరికి తెలుసు కాబట్టి వారిలో ఎవరూ పట్టించుకోరు. ఇక ఆస్కార్ వచ్చినందుకు గాను మరొక్కసారి రాజమౌళి, కీరవాణి, ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదివరకే రాజమౌళి దేశానికి గర్వించదగ్గ గొప్ప దర్శకుడని కూడా నేను వివరణ ఇచ్చాను. ఆయనతో పాటు RRR టీమ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసిందని అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.

కామెంట్స్ వైరల్

కామెంట్స్ వైరల్

అయితే ఇంత వివాదం అయ్యాక ఇప్పుడు ఆస్కార్ కి ప్రమోషన్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అని కుటుంబ పెద్దగా జాగ్రత్తలు చెప్పానని తమ్మారెడ్డి తన మాటలని సమర్ధించుకోవడంతో మరోసారి ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే నాగబాబు తిరిగి వీడియోలో చేసిన విమర్శలపై తమ్మారెడ్డి మళ్ళీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా... లేదంటే ఈ వివాదాన్ని ఇక్కడితో ముగిస్తారా అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X