twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘‘దర్శకుల బూట్లే హీరోలు నాకాలి... మనం వాళ్ల బూట్లు నాకే పరిస్థితి వద్దు’’

    |

    Recommended Video

    Dasari Film Awards Function || Filmibeat Telugu

    భీమవరం టాకీస్- భారత్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా 'దాసరి మెమోరియల్ ఫిల్మ్ అవార్డ్స్-2019' కార్యక్రమాన్ని మే 1న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు. ఈ అవార్డుల వేడుకలో ఆర్ నారాయణ మూర్తికి 'దాసరి జీవిత సాఫల్య పురస్కారం'.. దర్శకుడు పూరి జగన్నాథ్‌‌కు 'దాసరి ఎక్స్‌లెన్సీ అవార్డ్'.. జీవిత రాజశేఖర్ దంపతులకు 'దాసరి పద్మ అండ్ దాసరి నారాయణరావు అవార్డ్' దక్కింది. 'దాసరి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ అవార్డ్స్' మహా వెంకటేష్, వేణు ఊడుగుల, తిక్క శశి కిరణ్, గౌతమ్ తిన్ననూరి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఈ అవార్డుకు ఆర్ నారాయణ మూర్తి అర్హుడు

    ఈ అవార్డుకు ఆర్ నారాయణ మూర్తి అర్హుడు

    ‘‘నా జీవితంలో చాలా నంది అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ కమిటీలకు చైర్మన్‌గా ఉన్నాను, మెంబర్‌గా ఉన్నాను. చాలా మామూలు అవార్డ్స్ చూశాను. ఈ రోజు బెస్ట్ అవార్డ్స్ చూస్తున్నాను. ఆర్ నారాయణ మూర్తికి జీవిత సాఫల్య పురస్కారం అందించడం ఆనందంగా ఉంది. దాసరితో ఆయనకు ఉన్న అనుబంధం అలాంటిది. ఈ అవార్డుకు ఆయన పూర్తిగా అర్హుడు.'' అని తమ్మారెడ్డి తెలిపారు.

    తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పిన దర్శకుడు దాసరి

    తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పిన దర్శకుడు దాసరి

    తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పిన దర్శకుడు దాసరి నారాయణరావు. ఆయన పేరుపై ఇస్తున్న అవార్డులు సరైన వారికే దక్కాయి. నారాయణ మూర్తి తెలుగు సినిమా చరిత్రలో విభిన్నమైన సినిమాలు చేశారు. పూరి జగన్నాథ్ వచ్చి ఒక కొత్త ట్రెండ్ చూపించారు. కుర్రదర్శకులు మహా వెంకటేష్, వేణు ఊడుగుల, తిక్క శశి కిరణ్, గౌతమ్ తిన్ననూరి అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులు అన్నారు.

    ఈ నలుగురు ది బెస్ట్

    ఈ నలుగురు ది బెస్ట్

    దాసరి నారాయణరావుగారు ‘తాతా మనవడు' తీసినపుడు చూశాను. ఇతడేంటి? డైరెక్టర్ ఏంటి? ఎలా డైరెక్టర్ అయ్యాడు అనుకున్నాను. ఆ తర్వాత ఆయన దేశంలోనే ఒక గొప్ప దర్శకుడిగా ఎదిగారు. ఈ రోజు ఇక్కడ ఉన్న నలుగురు కుర్రాళ్లలో ఒక్కొక్కరిలో ఒక్కో దాసరి నారాయణరావు ఉన్నారు. నలుగురూ(మహా వెంకటేష్, వేణు ఊడుగుల, తిక్క శశి కిరణ్, గౌతమ్ తిన్ననూరి ) విపరీతమైన వేరియేషన్ చూపించారు.

    స్టార్ హీరోలను పట్టుకుని సక్సెస్ కొట్టలేదు

    స్టార్ హీరోలను పట్టుకుని సక్సెస్ కొట్టలేదు

    ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి సినిమాను సక్సెస్ బాట పట్టించడం చాలా కష్టం. ఏవరైనా స్టార్ హీరోను పట్టుకుని సినిమా తీస్తేనే సక్సెస్ ఈజీ అవుతుంది. ఈ నలుగురు అలా ఎవరో హీరోలను పట్టుకుని చేయలేదు. వాళ్లని వారు ప్రూవ్ చేసుకున్నారు. కొత్త కథాంశాలతో సినిమాలు తీశారు. వారు దాసరి నారాయణరావు అంశతో పుట్టారేమో అనిపిస్తుంది.

    దర్శకుల బూట్లే హీరోలు నాకాలి... మనం వాళ్ల బూట్లు నాకే పరిస్థితి వద్దు

    దర్శకుల బూట్లే హీరోలు నాకాలి... మనం వాళ్ల బూట్లు నాకే పరిస్థితి వద్దు

    ‘‘దాసరి నారాయణరావు ఒక్కటే చెప్పారు. మనం సినిమా ఆర్టిస్టులను సృష్టిస్తాం. ఆర్టిస్టులు మనల్ని సృష్టించకూడదు. మనం వాళ్ల కింద బూట్లు నాకే వాళ్లం అవ్వకూడదు... మన బూట్లే వాళ్లు నాకాలి అనే పరిస్థితికి తీసుకొచ్చారు. దర్శకులకు అంత గౌరవం తెచ్చారు. ఎంత గొప్ప నటుడైనా ఆయన వద్దకే వచ్చారు తప్ప ఈయన ఎవరి దగ్గరికీ వెళ్లలేదు.. సినిమాలు అడుక్కోలేదు. మీ నలుగురూ అలాగే ఉండి దర్శకులకు మరింత గౌరవం తెస్తారని ఆశిస్తున్నాను.'' అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

    English summary
    Tammareddy Bharadwaja Speech at Dasari Film Awards . Tammreddy Bharadwaja is an Indian film producer and director. He is one of the successful Telugu film producers. He is the son of veteran producer Tammareddy Krishna Murthy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X