‘సర్కారు వారి పాట’ నుంచి క్రేజీ అప్‌డేట్: ఇద్దరు సీనియర్ నటుల కోసం స్పెషల్ రోల్స్
వరుస హిట్లను అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదటి షెడ్యూల్ గతంలో విజయవంతంగా పూర్తైంది. ఇప్పుడు హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ శరవేగంగా సాగుతోంది. బ్యాంకులను మోసం చేసి పరావుతోన్న బడా పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో 'సర్కారు వారి పాట' రెండో షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో సీనియర్ నటులు తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి పాత్రలు ఎంతో ఫన్నీగా క్రియేట్ చేశాడట దర్శకుడు పరుశురాం. ఇవి కామెడీ పరంగా సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలవబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్‌లో ఈ రోల్స్ మీదే చిత్రీకరణ జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో 'సర్కారు వారి పాట'లో ఎంటర్‌టైన్‌మెంట్‌పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్ బాబు చాలా కాలం తర్వాత మాస్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన లుక్స్ కూడా బయటకు వచ్చాయి. ఇక, ఇందులో తన తండ్రి నిజాయితీని కనిపెట్టేందుకు హీరో చేసే పోరాటం హైలైట్‌గా ఉండబోతుందట. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











