పవన్ కొత్త సినిమాను లీక్ చేసిన తనికెళ్ల భరణి: డైరెక్టర్ పేరు చెప్పడంతో రచ్చ

తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. అంతలా అతడు హీరోగా కెరీర్‌ను మొదలెట్టినప్పటి నుంచి తన రేంజ్‌ను క్రమంగా పెంచుకుంటూ వెళ్తోన్నాడు. ముఖ్యంగా రీఎంట్రీలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, అభిమానులు బాగానే అలరిస్తున్నాడు. అంతేకాదు, ఇప్పటికే చేతి నిండా ప్రాజెక్టులను పెట్టుకుని ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో కొత్త సినిమాను కూడా ఒప్పుకున్నాడు. అదే 'వినోదయ సీతమ్' రీమేక్.

తమిళంలో రూపొంది ZEE5 ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ అయిన 'వినోదయ సీతమ్' సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రను కూడా చేశారు. ఇప్పుడిదే చిత్రాన్ని పవన్ కల్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు. దీనికి కూడా సముద్రఖని దర్శఖత్వం వహించబోతున్నారు. ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి ఓ కీలక విషయాన్ని లీక్ చేశారు.

Tanikella Bharani Leaks About Pawan Kalyan Vinodhaya Sitham Remake

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రాబోతున్న 'వినోదయ సీతమ్' సినిమాను ఈరోజు నుంచే ప్రారంభించబోతున్నట్లు తనికెళ్ల భరణి లీక్ చేశారు. సోమవారం రాత్రి జరిగిన 'సార్' మూవీ సక్సెస్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన సముద్రఖనిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సమయంలోనే 'సముద్రఖనితో రెండు సినిమాలు చేశాను. ఇక, ఇప్పుడు రేపటి నుంచే ఆయన దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేయబోతున్న చిత్రంలోనూ నాకు మంచి వేషం ఇచ్చాడు' అని పొరపాటున రివీల్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆ సభా ప్రాంగణం అంతా కేకలు వేస్తూ రచ్చ రచ్చ చేసేశారు. మొత్తానికి 'వినోదయ సీతమ్'ను పవన్ సీక్రెట్‌గానే షురూ చేసినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. దీనితో పాటు హరీష్ శంకర్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీని చేయనున్నాడు. అలాగే, సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా, సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో మరో చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X