తనీష్ ‘మహాప్రస్థానం’ ప్రారంభం.. సెట్‌లో అడుగుపెట్టి ఏడాదిన్నర కావొస్తోంది.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తనీష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మహాప్రస్థానం. జర్నీఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. మహాప్రస్థానం సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దేవుడి పటాలపై హీరో తనీష్ క్లాప్ నిచ్చారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది. మహాప్రస్థానం సినిమాలో ముస్కాన్ సేథీ నాయికగా నటిస్తుండగా...వరుడు ఫేం భానుశ్రీ మెహ్రా కీలక పాత్రను పోషిస్తోంది. కబీర్ దుహాన్ సింగ్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా ఫస్ట్ షాట్ చిత్రీకరణ అనంతరం హీరో తనీష్ మాట్లాడుతూ.. 'నేను సినిమా సెట్ లో అడుగుపెట్టి ఏడాదిన్నర కావొస్తోంది. కథలు వింటున్నాను, ఏదీ నచ్చడం లేదు, అప్పుడు జాని గారు మహాప్రస్థానం కథతో వచ్చారు. ఆయన చెప్పిన కథ నన్ను బాగా ఇన్ స్పైర్ చేసింది. అంత బాగుందీ కథ. చాలా రోజులుగా ఏదీ సరిగా కుదరనిది, జాని గారు కథ చెప్పిన మూడు రోజుల్లో సినిమా ఓకే అనుకున్నాం, నెల రోజుల్లో సెట్స్ మీదకు వచ్చాం. ఏదైనా జరగాలని ఉంటే ఇలాగే వేగంగా జరుగుతుందేమో. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ ఇది. నా మోకాలికి ఈ మధ్యే శస్త్ర చికిత్స జరిగింది. ఇదేమో యాక్షన్ సినిమా, దర్శకుడు జాని గారు మనం చేయగలమా అని సందేహించారు. సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు, అలా కథే మాలో ధైర్యం నింపింది. ముందడుగు వేసేలా చేసింది. మా పూర్తి శక్తి సామర్థ్యాలు ఈ సినిమాలో పెట్టి మంచి చిత్రాన్ని తీసుకొస్తామ'ని అన్నారు.

Tanish New Movie Maha Prasthanam Movie Is Opened

దర్శకులు జాని మాట్లాడుతూ... 'నేను గతంలో అంతకుమించి అనే చిత్రాన్ని రూపొందించాను. ఇది నా రెండో చిత్రం. మహాప్రస్థానం శ్రీశ్రీ గారు రాసిన గొప్ప పుస్తకం. మా చిత్రానికి ఆ పేరు పెట్టాలంటే చాలా ఆలోచించాము. టైటిల్ కు న్యాయం చేయగలమనే నమ్మకం వచ్చాకే పెట్టుకున్నాం. ఇదొక ఎమోషనల్ ఫ్రీక్, మామూలు సినిమాలా ఉండదు. అందరు అదే చెబుతారు. ఈ కథలో ఆ శక్తి ఉంది. ఇది బాగా వస్తుందని నమ్ముతున్నాం. ఇవాళ్టి నుంచి మహాప్రస్థానం రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించాం. జనవరి మొదటి వారం వరకు ఆపకుండా షూటింగ్ చేయబోతున్నామ'న్నారు. శుభాంగీ పంత్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Read more about: tanish johnny తనీష్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X