మరో పవర్‌ఫుల్ సబ్జెక్టుతో తనీష్...‘సరిహద్దు’ సైనికుడిగా!
మనిషికి, మనిషికీ.. దేశాలకు, ప్రాంతాలకు మధ్య కొన్ని హద్దులు ఉంటాయి. ఎవరి పరిధిలో వాళ్లున్నంత వరకూ అవి సరిగానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ సరిహద్దులు అతిక్రమిస్తే సంఘర్షణ మొదలవుతుంది. దేశాలు, ప్రాంతాల మధ్య ఈ సరిహద్దు సంఘర్షణలు తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు.. ఒక్కోసారి అది జాతీయ సమస్యగానూ మారొచ్చు.. అలా మారకుండా చూసే శక్తి ఆర్మీ.
సైనికుడు కేవలం సరిహద్దుకే కాదు దేశానికే రక్షకుడు. ఇదే కాన్సెప్ట్ తో తనీష్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. తనీష్ గత సినిమా 'రంగు'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కార్తికేయ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాతో 'రంగు' కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. నేషనలైజ్డ్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'సరిహద్దు' టైటిల్ ఖరారు చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ " భాషను నేర్చుకొని జ్ఞానాన్ని సంపాదించాలనుకొని.. ప్రతి భాషకు ఒక "తెగ "అనీ. .కొన్ని తెగలకు ఒక "కులం "అనీ.. కొన్ని కులాలు కలసి ఒక "మతం" అనీ విడిపోతూ.. మృగాల నుండి మనుషులుగా.. మనుషులనుండి "తెగలుగా" ... తెగలనునుండి "కులాలుగా".. కులాలనుండి "మతాలుగా"... మతాలనుండి "రాష్ట్రాలుగా".. రాష్ట్రాలనుంచి "దేశాలుగా".. సరిహద్దుల్ని గీసుకొంటూ... బతుకుతున్నాం. ఈ కాన్సెప్ట్ తో సరిహద్దు రూపొందబోతుంది " అన్నారు.
తెలుగుతో పాటు హిందీ భాషలోనూ విడుదల చేయబోతోన్న 'సరిహద్దు' మూవీ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభం కాబోతోంది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రంలో తెలుగుతో పాటు హిందీ భాషా నటులు కూడా నటించనున్నారు. త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











