కాపాడతాడనుకున్న లాయర్ కూడా కామాంధుడేనట.. తనూశ్రీ దత్తాకు షాక్
దేశ వ్యాప్తంగా లైంగిక ఆరోపణలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం మీటూ. హాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమం క్రమక్రమంగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో ప్రకంపనలు సృష్టించింది. బాలీవుడ్ నుంచి మీ టూ ఉద్యమంలో పాల్గొన్న తొలి హీరోయిన్ తను శ్రీ దత్తా. విలక్షణ నటుడు నానా పటేకర్‌పై ఈమె చేసిన లైంగిక ఆరోపణలు పెద్ద సంచలనానికి దారి తీశాయి.

అసభ్యంగా తాకాడంటూ..
తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేసింది తనుశ్రీ. అయితే దీనిపై నానా మాత్రం ఎప్పుడూ అసత్యమే అని కొట్టి పారేస్తూ వచ్చాడు. పదేళ్ల క్రితం 'హార్న్ ఓకే ప్లీజ్' సెట్స్‌లో తనను నానా పటేకర్ లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించింది.

కోర్టులో కేసులు..
నానా పటేకర్ పై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసి ఇండియాలో మీటూ ఉద్యమానికి ఆధ్యురాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. లైంగికంగా తనను నానా పటేకర్ వేదించాడు అంటూ తనూశ్రీ దత్తా మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో పాటు కోర్టులో కేసు కూడా వేసింది. తనూశ్రీ దత్తా వేసిన కేసు తో పాటు నానా పటేకర్ కూడా తనూశ్రీ దత్తా పై కేసు వేశాడు.

తనూశ్రీ తరుపున నితిన్..
దీంట్లో తనూశ్రీ దత్తా తరపున నితిన్ సత్పుటే అనే లాయర్ వాదిస్తున్నాడు. గత సంవత్సర కాలంగా తనూశ్రీ దత్తా తరపున లైంగిక వేదింపులకు వ్యతిరేకంగా ఆయన వాదిస్తూ వస్తున్నాడు. ఆడవారిపై జరుగుతున్న లైంగిక వేదింపులు తగ్గాలంటూ కోర్టులో తన వాదనలు వినిపిస్తున్న నితిన్ సత్పుటే ఒక కామాంధుడు అంటూ ఒక మహిళా లాయర్ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.

మహిళా లాయర్‌తో అసభ్యంగా..
ఒక భూ వివాదంలో నితిన్ సత్పుటే కేసు వాదిస్తున్నాడు. ఆ వివాదంను రాజీ కుదిర్చేందుకు అవతలి వర్గం వారి లాయర్‌తో భేటీ అయ్యాడు. రాజీ గురించి మాట్లాడే సమయంలో నితిన్ సత్పుటే మాట తీరు ఆమెకు అస్సలు నచ్చలేదట. మహిళలను కించ పర్చేవిధంగా మాట్లాడటంతో పాటు తనను లైంగికంగా వేదించే విధంగా మాట్లాడాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నితిన్ సత్పుటేపై కేసు నమోదు అవ్వడంతో తనూశ్రీ దత్తా ఏం చేయబోతుందా అంటూ అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











