twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి విమర్శలపాలైన తాప్సీ..

    |

    సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ లో ప్రతి ఒక్కరూ ఏదోక ఇబ్బంది ఎదుర్కుంటూనే ఉన్నారు. అదేవిధంగా మన క్యూట్ బ్యూటీ తాప్సీ పన్నుకు కూడా ఓ చిన్న కష్టం వచ్చింది. అయితే అమ్మడికి వచ్చిన కష్టం తెలుసుకుని జనాలు కరిగిపోతారు అనుకుంటే తిరిగి ఆమెనే దెప్పి పొడుస్తున్నారట.

    ఓవైపు కరోనా, మరోవైపు సమ్మర్ కష్టాలతో దేశవ్యాప్తంగా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ వేడికి తగ్గట్లు సడన్ గా తాప్సీ ఇంట్లో ఏసీ పనిచేయడం మానేసిందట. ఇక లాక్ డౌన్ పుణ్యమాని ఏసీ రిపేర్ మెకానిక్ కూడా దొరక్కపోవడంతో అమ్మడు సొంత రిపేరు చేసుకుని గుడ్డిలో మెల్ల చందాన్న ఎండ నుంచి స్వాంతన పొందుతోంది.

    Tapsee pannu Slammed yet again

    మరి ఇందులో అమ్మడిని అంత ఘనంగా ఆడిపోసుకోవడం దేనికి అంటారా? అయితే విషయం ఏమిటంటే ఏసీ నుంచి నీళ్లు కారుతుండటంతో దానికి రెండు చున్నీలు కట్టుకుని ప్రస్తుతానికి ఎలాగోలా నెట్టుకువస్తోంది తాప్సీ. అయితే తన కష్టానికి తానే చలించిపోయిందో ఏమో తన బాధనంతా వెళ్లగక్కుతూ సోషల్ మీడియోలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అక్కడ మొదలైంది అసలు గొడవ.

    జనాలు నిలువు నీడలేకుండా రోడ్లపై అవస్థలు పడుతుంటే... తమరికి ఏసీ మెకానిక్ కావాలా తల్లీ అంటూ... ట్విట్టర్ లో తాప్సీని ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు. నటి అయిన పాపానికి కనీసం తన బాధను కూడా వెళ్లగక్కునివ్వని ఈ పాడులోకంతో తనకు పనిఏముంది! అందుకే అమ్మడు ఎప్పటిలాగానే, ఇవన్నీ పక్కన పెట్టి హాయిగా తన పని తాను చేసుకుపోతోంది. ఏమైనా... ఏసీ లీక్ అవుతున్నప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై తాప్సీ ఇచ్చిన సలహా మాత్రం అదిరిపోయింది కదూ!

    English summary
    Tapsee pannu trolled yet again for her recent post. As she posted a video explaining about the breakdown of AC in her room, and She couldnt find a mechanic, and how she has managed it with duppatas, netizens started, giving her severe back lash.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X