Taraka Ratna's Health Update కోమా నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం.. కీలక ప్రకటన రిలీజ్!

నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

స్థానిక హాస్పిటల్‌లో చికిత్స అందించిన తర్వాత మెరుగైన ఆరోగ్యం కోసం ఆయనను బెంగళూరుకు తరలించారు. అయితే అప్పటి నుంచి ఆయనను కోమా నుంచి బయటకు తెచ్చేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. తారకరత్నకు సంబంధించిన హెల్త్ అప్ డేట్ విషయంలోకి వెళితే..

Taraka Ratnas Health Update By Narayana Hrudalaya Hospital

తారకరత్న గత 20 రోజులుగా బెంగళూరులోని హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే విదేశాల నుంచి వైద్యులను రప్పించి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. అయితే చికిత్స కొనసాగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 16వ తేదీన ఆయన ఆరోగ్యంపై రూమర్లు మీడియాలో షికారు చేశాయి. దాంతో ఆయన సన్నిహితులు ఆ వార్తలను ఖండించారు.

తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం తారకరత్న బ్రెయిన్ స్కాన్ చేశారని, ఆయనను కోమా నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం వైద్యులు చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులు కీలక సమాచారాన్ని అందించే అవకాశం ఉందనే వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. గురువారం వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది అని సన్నిహితులు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X