ఆ హీరోయిన్‌తో ప్రేమాయణం? ఓపెన్ అయిన టాలీవుడ్ డైరెక్టర్.. ఆమెతో నడుస్తోందంటూ
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో హీరోలు, హీరోయిన్లు, ఇతర టెక్నీషియన్లు ఒకరి తర్వాత ఒకరు శుభవార్తలు చెబుతున్నారు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనిపించుకున్న వాళ్లు పెళ్లి పీటలెక్కుతున్నారు. మరికొందరు తమ ఎఫైర్లను బయటపెడుతున్నారు. టాలీవుడ్‌లో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్లుగా గత కొంతకాలంగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ సినిమా ఈవెంట్‌లో ఈ ఇష్యూపై భాస్కర్ ఓపెన్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..
వరంగల్‌కు చెందిన తరుణ్ భాస్కర్ 2016లో విజయ్ దేవరకొండ - రీతూ వర్మ జంటగా వచ్చిన పెళ్లి చూపులు చిత్రంతో హిట్ అందుకున్నారు. దాంతో భాస్కర్ పేరు టాలీవుడ్‌లో మారుమోగింది. స్టార్ హీరోలు, ఆయనతో సినిమాలు తీస్తారని ఇక భాస్కర్ బిజీ అవుతారని క్రిటిక్స్ భావించారు. కానీ ఆ సక్సెస్‌ను తర్వాత కంటిన్యూ చేయలేకపోయారు తరుణ్. పెళ్లి చూపులు విడుదలై రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ నగరానికి ఏమైంది, పిట్ట కథలు, కీడా కోలా సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. మధ్యలో తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేయగా.. ఆయనను నటుడిగా జనం అంగీకరించడం, మంచి పాత్రలు వెతుక్కుంటూ రావడంతో తరుణ్ భాస్కర్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. బుల్లితెరపై హోస్ట్‌గానూ ఆయన అలరించారు.

స్టార్‌డమ్ కోసం పోరాటం
ఇక వరంగల్ ప్రాంతానికే చెందిన ఈషా రెబ్బా కూడా హీరోయిన్‌గా అడుగుపెట్టారు. అంతకుముందు ఆ తర్వాత, బందిపోటు, ఓయ్, అమీతుమీ, దర్శకుడు, అ, బ్రాండ్ బాబు, అరవింద సమేత, సుబ్రహ్మణ్యపురం, సవ్యసాచీ, రాగల 24 గంటల్లో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, మామ మశ్చీంద్ర వంటి తెలుగు సినిమాలలో నటించింది. నటిగా పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ స్టార్‌డమ్ అందుకోలేకపోయారు ఈషా రెబ్బా. అయినప్పటికీ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.
ఈషాతో తరుణ్ భాస్కర్ ప్రేమాయణం?
ఇదిలాఉండగా.. ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్‌లు ప్రేమలో పడ్డారని, ఇద్దరూ సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమాలో జంటగా నటిస్తుండగా.. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే భాస్కర్, ఈషలు ప్రేమలో పడ్డారని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం హీరో విశ్వక్‌సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా హాజరయ్యారు. దాంతో వీరి మధ్య ప్రేమాయణం నిజమే అనడానికి బలం చేకూరినట్లయ్యింది. తాజాగా తనకు తానుగా ఈ ఎఫైర్ గురించి బయటపెట్టారు తరుణ్.
నవంబర్ 21న రాజు వెడ్స్ రాంబాయి
అఖిల్ రాజ్ - తేజస్విని జంటగా సాయిలు కంపటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్స్‌లో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవిలు ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 21న రాజు వెడ్స్ రాంబాయి సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటిలు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో రాజు వెడ్స్ రాంబాయి చిత్ర యూనిట్ గత కొద్దిరోజులుగా ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.
చివరి అర్థగంట సూపర్
నవంబర్ 20వ తేదీన హైదరాబాద్‌లో రాజు వెడ్స్ రాంబాయి మాస్ బరాత్ పేరిట ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తరుణ్ భాస్కర్ సినిమా చాలా బాగా వచ్చిందని, వరంగల్ గర్వపడే విధంగా వేణు భాయ్, సాయిలు కష్టపడ్డారని ప్రశంసించారు. చివరి నిమిషంలో మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందని, 15 సంవత్సరాల నుంచి ఆ ఊరు, ఆ స్టోరీని మొత్తానికి ఎవరికి తెలవకుండా మూసుకుపోయిందట. ఆ సీక్రెట్ ఏంటో ఈ సినిమా చూస్తే.. లాస్ట్ 30 మినిట్స్ అదిరిపోయిందని క్రూలో కూడా టాక్ వినిపిస్తోంది. అందరూ చాలా బాగా చేశారని తరుణ్ భాస్కర్ ఆల్‌ది బెస్ట్ చెబుతూ తన ప్రసంగం ముగించారు.
ఔను ఆమెతో నడుస్తోంది
తరుణ్ వెళ్తుండగా.. మీరు క్లైమాక్స్ ఏమై ఉంటుందని అనుకుంటున్నారని యాంకర్ స్రవంతి చొక్కారపు ప్రశ్నిస్తుంది. మీకు కదా తెలిస్తే అది చెప్పొద్దు.. ఒక మీమ్ నడుస్తోంది ఇంటర్నెట్‌లో అని ఆన్సర్ ఇస్తాడు తరుణ్. మీరు ఇప్పటి వరకు రియల్ లైఫ్‌లో చూసిన గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవరిది? అది సెలబ్రిటీలు కావొచ్చు? మీ ఫ్రెండ్స్ అవ్వొచ్చు అని స్రవంతి ప్రశ్నించగా... అది నాదే, నేను చూసుకుంటున్నా, అది అవుతూనే ఉంది అని తరుణ్ ఆన్సర్ ఇచ్చాడు. దాంతో ఆ పేరు నాకు తెలుసు.. కానీ బయటకు చెప్పను అనవసరంగా ఎందుకు అని స్రవంతి నవ్వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. హీరోయిన్ ఈషాతో తాను ప్రేమలో ఉన్నట్లు తరుణ్ భాస్కర్ ఓప్పేసుకున్నారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











