మరో వివాదంలో నాగశౌర్య.. మనోభావాలు దెబ్బతిశాడంటూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఇటీవలె అశ్శథ్థామ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఛలో చిత్రం తరువాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ అందుకున్నాడీ హీరో. సినిమా విషయంలో కాకుండా.. వ్యక్తిగత విషయాలతో నాగశౌర్య వార్తల్లోకెక్కుతున్నాడు. ఛలో సినిమా వివాదం, ఆ దర్శకుడిపై విమర్శలు చేయడం అప్పట్లో తెగ హల్ చల్ చేశాయి. తాజాగా మరో ఘటనతో నాగ శౌర్య పేరు వార్తల్లో వినిపిస్తోంది.

దర్శకుడితో గొడవలు..
ఛలో సినిమా ఘన విజయం సాధించాక.. దర్శకుడు వెంకీ కుడుముల, హీరో నాగ శౌర్యకు గ్యాప్ పెరిగింది. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని, తానే దూరంగా వెళ్లిపోయాడని చెప్పుకొచ్చాడు. తన అమ్మ కొనిచ్చిన కారును కూడా వాడకుండా చిన్నచూపు చూశాడని తెలిపాడు. అతను మా కుటుంబాన్ని, మా అమ్మను బాధపెట్టాడని, ఎప్పటికీ క్షమించనని పేర్కొన్నాడు.

మరో వివాదం..
మూవీ ప్రమోషన్లలో భాగంగా.. నాగశౌర్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ డ్రైవర్ల సంఘం ఆరోపించింది. ఈ మేరకు మానవ హక్కుల సంఘంలో నాగశౌర్యపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

నాగశౌర్య వ్యాఖ్యలపై సీరియస్..
ఓ టీవీ చానల్ నిర్వహించిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొన్న నాగశౌర్య రిపోర్టర్ జాఫర్ ‘అశ్వత్థామ' సినిమాపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ... డ్రైవర్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు జేఏసీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ ఆరోపించారు. డ్రైవర్లు చదువురాని వారు, తాగుబోతులు అని అర్థం వచ్చేలా మాట్లాడారన్నారు.

లాభాల్లోకి వచ్చిన అశ్వథ్థామ..
అశ్వథ్థామ చిత్రానికి పాజిటివ్ రివ్యూలతో పాటు కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఈ చిత్రం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి.. ఆరో రోజు నుంచి లాభాల బాట పట్టినట్టు పేర్కొన్నారు. నాగ శౌర్య ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్‌తో ఓ కూల్ లవ్ స్టోరీని చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











