ఆగిపోలేదు... విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ వచ్చేస్తోంది!
'పెళ్లి చూపులు' మూవీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన 'గీత గోవిందం' చిత్రం రూ. 100 కోట్లకుపైగా వసూలు చేయడంతో ఒక్కసారిగా పెద్ద స్టార్ అయిపోయాడు.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్-యూవి క్రియేషన్స్ సంయుక్తంగా విజయ్ దేరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'టాక్సీవాలా'. వాస్తవానికి ఈ చిత్రం 'గీత గోవిందం' కంటే ముందే విడుదలవ్వాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక సినిమా విడుదల కాదేమో అని, ఆగిపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. నవంబర్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
టాక్సీవాలాలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, సైన్స్ ఫిక్షన్స్, థ్రిల్లర్, కామెడీ చాలా ఉన్నాయి. నా కెరీర్లో చేస్తున్న డిఫరెంట్ మూవీ. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, ఈ మూవీపై పూర్తి నమ్మకంతో ఉన్నాను అని విజయ్ దేవరకొండ గతంలో ఓ సందర్భంలో తెలిపారు.

నటీనటులు: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు.
సాంకేతిక వర్గం
పబ్లిసిటీ డిజైనర్ - అనంత్ కంచర్ల
సౌండ్ - సింక్ సినిమా
స్టంట్స్ - జాషువా
ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి
లిరిక్స్ - కృష్ణ కాంత్
మ్యూజిక్ - జేక్స్ బిజాయ్
ఎడిటర్, కలరిస్ట్ - శ్రీజిత్ సారంగ్
సినిమాటోగ్రాఫర్ - సుజిత్ సారంగ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - సాయి కుమార్ రెడ్డి
నిర్మాత - ఎస్ కె ఎన్
ప్రొడక్షన్ హౌజ్ - జీఏ 2 , యువి పిక్చర్స్
స్టోరీ, డైరెక్షన్ - రాహుల్ సంక్రిత్యాన్


Click it and Unblock the Notifications











