వీక్ కాదు... పీక్: వాళ్లకు చుక్కలు చూపించిన ‘టాక్సీవాలా’, నిర్మాత ట్వీట్!
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'టాక్సీవాలా' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళుతోంది. రిలీజ్ ముందే సినిమా మొత్తం లీకైనా ఆ ఎఫెక్ట్ ఏమాత్రం సినిమాపై పడక పోగా వసూళ్ల వర్షం కురిపిస్తూ నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను లాభాల బాటలోకి నెట్టేసింది.
Recommended Video

సాధారణంగా వీక్ డేస్‌లో ఏ సినిమా కలెక్షన్స్ అయినా కాస్త నిరాశ పరిచే విధంగా ఉంటాయి. అయితే టాక్సీవాలా విషయంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. సోమ, మంగళ, బుధవారాల్లో సినిమా రన్ అవుతున్న అన్ని చోట్లా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో కళకళలాడింది.
వీక్ కాదు...పీక్ అంటూ నిర్మాత ట్వీట్
టాక్సీవాలా నిర్మాత ఎస్కేన్ స్పందిస్తూ ... వీక్ డేస్‌లో మా సినిమా ఏ మాత్రం వీక్ కాలేదు. కలెక్షన్స్ పీక్ రేంజికి వెళ్లాయి. బుధవారం కూడా అన్ని చోట్లా వసూళ్లు అదరగొట్టిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

బెంగుళూరులో ఇతర సినిమాలకు చుక్కలు
బుధవారం బెంగుళూరు సిటీలో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన ‘టాక్సీవాలా' అక్కడి లోక్ హీరోల సినిమాలను సైతం చుక్కలు చూపించింది. టాక్సీవాలా స్పీడును ఇతర సినిమాలు అందుకోలేక పోవడం చర్చనీయాంశం అయింది.

రూ. 25 కోట్లుపైగా గ్రాస్
తొలి రోజే బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాటలోకి తీసుకెళ్లిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 25 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. నెక్ట్స్ వీకెండ్ సమయానికి వసూళ్లు ఓ రేంజిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు.
గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్
టాక్సీవాలా భారీ విజయం సాధించిన నేపథ్యంలో నవంబర్ 23న గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సెబ్రేషన్స్‌లో విజయ్ దేవరకొండతో పాటు టీమ్ మొత్తం పాల్గొంటారు.


Click it and Unblock the Notifications











