వినడానికి విచిత్రంగానే ఉంటుంది.. కానీ నమ్మండి.. విజయ్ దేవరకొండ టాక్సీవాలా ట్రైలర్!
విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా. నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకుడు. డెబ్యూ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ట్రైలర్ రిలీజ్ చేశారు.
విజయ్ దేవరకొండ శైలిలో సాగే యూత్ ఫుల్ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటోంది. అంతే కాదు.. ఈ చిత్రం హర్రర్ కామెడీతో కూడుకున్నది అని కూడా ట్రైలర్ బట్టి అర్థం అవుతోంది. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తన కారు అద్దంపై దెయ్యం చేతులు కనిపించడంతో గజగజ వణికిపోతాడు.
హీరోయిన్ తో సాగే రొమాంటిక్ సన్నివేశాలు కట్టుకునేలా కనిపిస్తున్నాయి. హీరోయిన్ మద్యం మత్తులో పడిఉంటుంది. నేను మంచివాడిని కాబట్టి సరిపోయింది కానీ.. అంటూ విజయ్ చెప్పే డైలాగ్ అక్కట్టుకుంటోంది. దెయ్యం గురించి తన స్నేహితులకు విజయ్ వివరించే సన్నివేశాన్నీ కూడా మంచి కామెడీతో తెరకెక్కించారు. వినడానికి విచిత్రంగానే ఉంటుంది.. కానీ నమ్మండి అని తన స్నేహితులతో విజయ్ ఆటాడు. మొత్తంగా ఈ చిత్రంలో దెయ్యం ఎవరనేది ఉత్కంఠ భరిత అంశం.



Click it and Unblock the Notifications











