‘యాంకర్ శ్యామల.. నీ చీకటి బాగోతాలు బయటపెట్టమంటావా?’
యాంకర్ శ్యామల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేయడంపై జనసేన, టీడీపీ కార్యకర్తలు ఘాటుగా స్పందిస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియాకు చెందిన అనూష ఉండవలి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యారు. ఇలానే పిచ్చి పిచ్చ కథలు చెబితే.. నీ చీకటి బాగోతాలను బయటపెడుతాం అని హెచ్చరించారు. యాంకర్ శ్యామల వివాదం, అలాగే అనూష ఉండవల్లి స్పందించిన విధానం వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్టార్ యాంకర్ , సినీనటి శ్యామల అధికార వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారు. తన వాడి వేడి విమర్శలు, పంచ్‌లతో కేడర్‌ను, జనాన్ని ఉత్సాహపరుస్తున్నారు. స్వతహాగా యాంకర్ కావడంతో అలవోకగా ప్రసంగాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం వైఎస్ జగన్‌ను గెలిపించాలని శ్యామల పిలుపునిచ్చారు.

అక్కడి వరకు ఆగితే ఎవరూ పట్టించుకునేవారు కాదు.. కానీ సదరు ఇంటర్వ్యూలో ఆమె '' ముసలి తోడేలు - గుంట నక్క '' స్టోరీ చెప్పారు. శ్యామల వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి పరోక్షంగా శ్యామల ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆ రెండు పార్టీ ల కేడర్ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తోంది.
ఈ క్రమంలో టీడీపీ నేత ఉండవల్లి అనూష తనదైన శైలిలో శ్యామలకు గట్టి కౌంటరిచ్చారు. కొందరు కుల పిచ్చితో.. తమ కులానికి చెందినవాళ్లు ఎవరు పార్టీ పెడితే, వాళ్ల జెండాలు కప్పుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. అప్పట్లో షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పెడితే.. ఆమెను కలిసి ఆ జెండాను కప్పుకుని , నా సపోర్ట్ ఆమెకు అని చెప్పిందని.. తీరా షర్మిల పార్టీ ఎత్తేయగానే అదే కులపిచ్చితో శ్యామల ఏపీకి పరిగెత్తుకొచ్చిందంటూ అనూష సెటైర్లు వేశారు.
యాంకర్ శ్యామల తన భర్తది అదే కులం కాబట్టి.. అతను ఎన్ని చీటింగ్‌లు చేసినా ఆయన కాపాడుతున్నాడు కాబట్టి , లేదంటే నాకు దండిగా డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి.. ఇష్టానుసారం మాట్లాడేస్తా, ఆంధ్రా ప్రజలకు కథలు చెబుతానంటే కుదరని శ్యామలను హెచ్చరించారు. ఆవిడ అలాగే ముందుకెళ్తే .. మేం కూడా కొన్ని నిజాలు మాట్లాడాల్సి వస్తుందని.. అసలు ఆంధ్రలో శ్యామలకు ఏం పని , ఐదేళ్లుగా ఏపీ వైపు చూశారా అని అనూష ప్రశ్నించారు.

ఆంధ్రలో ఉన్నది మేం, భరించింది మేం, కోల్పోయింది మేం.. నువ్వు కథ చెబితే నేను నిజం చెబుతానని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే అనూష కూడా ఏపీ విభజన, చంద్రబాబు తొలి సీఎంగా పగ్గాలు అందుకోవడం, జగన్ పాలన గురించి సెటైరికల్‌గా కథ చెప్పారు. సొంత కుటుంబ సభ్యుడిని చంపేసి, తనకు తానుగా కోడికత్తితో పొడిపించుకుని, తల్లిని చెల్లిని అడ్డు పెట్టుకుని జగన్ అధికారంలోకి వచ్చారని అనూష దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఓ గుంటనక్కని తరిమి తరిమి కొట్టడానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా వున్నారంటూ శ్యామలకు కౌంటరిచ్చారు.
మాకు నోరుంది, దేవుడు వాక్చాతుర్యం ఇచ్చాడు.. యాంకరింగ్, నాలుగు సినిమా ఫంక్షన్లు చేసుకోకుండా ఇలా రాజకీయాల్లోకి వచ్చి అవగాహన లేకుండా మాట్లాడితే, చంద్రబాబు, పవన్ కల్యాణ్ జోలికి వస్తే.. నీ గురించి, నీ చీకటి బాగోతాల గురించి , నీ భర్త చేసిన అరాచకాలను కూపీ లాగి ప్రజలకు చెబుతామని శ్యామలకు అనూష వార్నింగ్ ఇచ్చారు. నిజాలు చెబుతాం.. నీలా కథలు కాదు అంటూ ఆమె ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఉండవల్లి అనూష వ్యాఖ్యలపై శ్యామల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











