‘పవన్‌ వ్యక్తిత్వానికి అది నిలువెత్తు రూపం.. స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి’

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన ప్రతిభతో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. సినిమాల కంటే తన వ్యక్తిత్వంతోనే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సమాజానికి, పేదలకు ఏమైనా చేయడానికి పవన్ ముందుంటారు. ఇదే ఆయనను మిగిలిన వారికి భిన్నంగా నిలబెట్టింది. పవన్‌ను చాలా దగ్గరి నుంచి చూసిన వారు, పది నిమిషాలు మాట్లాడిన వారు ఇట్టే ఆయనకు అభిమానులకు మారిపోతుంటారు. తన గుణగణాలతో అంతలా అట్రాక్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్.

నిజానికి పిఠాపురం నుంచి పోటీ చేయాలని వర్మ ఎంతో ప్రయత్నించారు. విపక్షంలో ఉండగా వైసీపీ వేధింపులు, ఒత్తిడిని తట్టుకుని మరి పార్టీని పట్టిష్టం చేశారు. అయితే కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరారు. అయితే వర్మను కాదని పిఠాపురం సీటును పవన్‌కు ఎలా కేటాయిస్తారంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో వర్మ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతారన్న ప్రచారం కూడా జరిగింది.

tdp leader ex mla svsn varma praises janasena chief pawan kalyans Personality

అయితే ఆయన సత్తా, శక్తి సామర్ధ్యాలు ఏంటో తెలిసిన చంద్రబాబు తక్షణం వర్మను పిలిపించి మాట్లాడారు. బాబు హామీతో మెత్తబడిన వర్మ.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంతో శ్రమించారు. పవన్‌ను ఓడించడానికి సీఎం జగన్ వేసిన ఎత్తుగడలు, వ్యూహాలను ధీటుగా తిప్పికొట్టడంలో వర్మ కీలకపాత్ర పోషించారు. పవన్‌ను ఎన్నికల్లో ఓడించాలని తనకు భారీ మొత్తం ఆఫర్ చేశారని వ్యాఖ్యానించారు. పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అనగానే చాలా ఒత్తిళ్లు వచ్చాయని.. కానీ తనను ఎవ్వరూ కొనలేరని వర్మ స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వారిద్దరితో పాటు నేను కూడా పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు.

tdp leader ex mla svsn varma praises janasena chief pawan kalyans Personality

చంద్రబాబుకు అతిపెద్ద మద్ధతుదారుడినని, కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు సహజమని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచే తనపై చాలా ఒత్తిళ్లు వచ్చాయని కానీ తాను కమిట్‌మెంట్‌తో పనిచేసే వ్యక్తినని స్పష్టం చేశారు. తనకు ఇద్దరు అధ్యక్షులున్నారని.. ఒకరు చంద్రబాబు, మరొకరు పవన్ కళ్యాణ్ అని వర్మ చెప్పారు. వారిద్దరూ తనకు ఏ బాధ్యత అప్పగించినా తూచా తప్పకుండా నిర్వర్తిస్తానని కుండబద్ధలు కొట్టారు.

తాజాగా పవన్ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పారు టీడీపీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మ. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఓసారి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లగా అక్కడ కూర్చొని ఉన్నామన్నారు. ఇంతలో తనకు గొంతులో ఏదో తేడాగా ఉండటంతో ఇబ్బందిగా అనిపించిందని, తన పరిస్ధితిని గమనించిన పవన్ లేచి అక్కడే ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి తాగమన్నారని వర్మ తెలిపారు. ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు పనివాళ్లను పిలవడమో , లేదంటే కాలింగ్ బెల్ నొక్కుతారని కానీ పవన్ మాత్రం తన హోదాను, స్టార్ డమ్‌ను పక్కనబెట్టి ఎదుటివాళ్లని గౌరవిస్తారని వర్మ ప్రశంసించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X