అనసూయను పెట్టి మీరు ఏం చెశారు? ఏం చెప్పారు? వైఎస్ జగన్‌‌పై కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నల వర్షం

యాత్ర, యాత్ర 2, రాజధాని ఫైల్స్ సినిమాలపై టెలివిజన్ ఛానెల్‌లో జరిగిన చర్చలో రైతు నేత, టీడీపీ అనుకూల నేత కొలికపూడి శ్రీనివాసరావు ఘాటుగా స్పందించాడు. యాత్ర సినిమాలు అభూత కల్పనలు, వాస్తవాలకు దూరంగా కథ చెప్పారు. వాటిని ప్రజలు నమ్మడం లేదు అని ఆయన అన్నారు. వైఎస్ జగన్, యాత్ర 2 సినిమాలోని అంశాలను కొలికపూడి ప్రశ్నిస్తూ..

యాత్ర సినిమా కథ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రగా చూపించారు. యాత్ర 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. యాత్ర 1 అబద్దాల మాత్ర. యాత్ర 2 సినిమా జగన్మోహన్ రెడ్డి రాజకీయ అంతిమ యాత్ర అని సామాజిక కార్యకర్త, రైతు ఉద్యమనేత, టీడీపీ అనుకూల నేత కొలికపూడి శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు.

Kolikapudi Srinivasa Rao questions YS Jagan

రాంగోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాను లోకేష్ కోర్టులో అడ్డుకొంటే.. అప్పుడు వైసీపీ వాళ్లు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తమపై అసభ్యంగా, అశ్లీలంగా సినిమాలు తీసినందుకు ఆయన స్పందించారు. కానీ ఈ రోజు యాత్ర సినిమా అబద్దాల సినిమా. రాజధాని ఫైల్స్ దర్శకుడు భాను తీసినందుకు చేతులెత్తి నమస్కరించాలి. వాస్తవాలను దర్వకుడు చెప్పాడు అని కొలికపూడి అన్నాడు.

2019 సంవత్సరానికి ముందు జగన్ వెంట చెల్లెలు, తల్లి ఉండేది. ఇప్పుడు ఆయన వెంట వైఎస్ కుటుంబమే లేదు. యాత్ర సినిమాలో పాణ్యం సరితారెడ్డి సీన్ బాగా పాపులర్ అయింది. సరితా రెడ్డి పాత్రలో అనసూయను పెట్టి .. సహాయం కోసం వచ్చిన ఆడబిడ్డతో రాజకీయం చేయడం ఏంటి? అని వైఎస్ఆర్ అనే డైలాగ్స్ చెప్పారు అనే విషయాన్ని కొలికపూడి గుర్తు చేశాడు. ఆ పాత్రతో ఏం చెప్పారు? ఇప్పుడు షర్మిలతో మీరు వ్యవహరిస్తున్నదేమిటి అని ప్రశ్నించాడు.

కానీ ఈ రోజు షర్మిలతో వైఎస్ జగన్ చేసిందేమిటి? షర్మిల పెళ్లి గురించి నీచంగా మాట్లాడుతున్నారు. ఆమె భర్త గురించి మాట్లాడుతున్నదేమిటి? ఆమె కుటుంబం గురించి మాట్లాడుతున్నదేమిటి? బాబాయ్ కూతురుని హంతకురాలు అని వాళ్ల టీవీ, పేపర్లలో కథనాలు వెల్లడించారు. యాత్ర 2 సినిమా వైఎస్ జగన్‌కు ఏ మాత్ర ఉపయోగపడదు అని కొలికపూడి శ్రీనివాసరావు ఘాటుగా స్పందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X