బాలీవుడ్ సింగర్‌తో డేటింగ్‌‌ .. ఆమెతో నా రిలేషన్ అదే అంటూ తేల్చేసిన మహ్మద్ సిరాజ్

భారతదేశంలో క్రికెట్‌కు, సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ ఇద్దరు కలిసినా ఖచ్చితంగా మాట్లాడేది ఈ రెండింటి గురించే. క్రికెటర్లను, సినీతారలను అభిమానులు దేవుళ్లుగా కొలుస్తారు మనదేశంలో. ఇక ఎంతో మంది హీరోయిన్లతో క్రికెటర్లు ప్రేమాయణం నడిపారు. వీరిలో పెళ్లి వరకు వెళ్లింది కొన్నే. మిగిలినవి మధ్యలోనే బ్రేక్ అయ్యాయి. నాటి షర్మిళా ఠాగూర్- టైగర్ పటౌడీ మొదలు విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ వరకు పలువురు క్రికెటర్లు, హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

నిర్మత్ కౌర్ - రవి శాస్త్రి, మాధురి దీక్షిత్ - అజయ్ జడేజా, నిధి అగర్వాల్ - కేఎల్ రాహుల్, ఇజబెల్లె - విరాట్ కోహ్లీ, ప్రీతి జింటా - యువరాజ్ సింగ్, దీపిక పదుకొనె - యువరాజ్ సింగ్, కిమ్ శర్మ - యువరాజ్ సింగ్, సుస్మిత సేన్ - వసిం అక్రమ్, ఇషా శర్వాణి- జహీర్ ఖాన్, నగ్మా - సౌరవ్ గంగూలీ, అమృతా సింగ్ - రవి శాస్త్రి, ఇషా గుప్తా - హర్డీక్ పాండ్యా, శృతి హాసన్ - సురేష్ రైనా మధ్య ఎఫైర్లు నడిచినట్లు మీడియా కోడై కూసింది. ఇప్పటికీ పలువురు క్రికెటర్లు - హీరోయిన్ల మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Team India Cricketer Mohammad Siraj Shut Down Dating Rumours with bollywood legendary singer Asha Bhosle s Grand daughter Zanai

కొద్దిరోజుల క్రితం టీమిండియా స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ - టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ డేటింగ్‌లో ఉన్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే మా ఇద్దరి మధ్యా ఎలాంటి రిలేషన్ లేదని, ఒకవేళ గిల్‌తో డేటింగ్ చేసే అవకాశం వస్తే వదులుకోనని ప్రగ్య బోల్డ్‌గా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్.. బాలీవుడ్ దిగ్గజ నేపథ్య గాయనీ ఆశా భోస్లే మనవరాలు, సింగర్ జనై భోస్లేలు డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. ఇటీవల ముంబైలో జరిగిన జనై 23వ పుట్టినరోజు వేడుకల్లో సిరాజ్ సందడి చేయడం ఈ వార్తలకు బలాన్ని ఇచ్చింది.

సోమవారం ఉదయం నుంచి సినీ, క్రీడా వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో వీరిద్దరి గురించే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వ్యవహారం తేడా కొట్టేలా ఉండటంతో వెంటనే సిరాజ్ అప్రమత్తమయ్యాడు. జనై తనకు చెల్లెలు లాంటిదని, ఆమె లాంటి సోదరు నాకెవ్వరూ లేరని.. నక్షత్రాలలో చంద్రుడు ఉన్నట్లే, 1000 మందిలో జనై ఒకరని పేర్కొంటూ ఈ పుకార్లకు తెరదించాడు. అటు జనై కూడా వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. సిరాజ్ తన సోదరుడని స్పష్టం చేశారు. సో.. అదన్న మాట మేటర్.

Team India Cricketer Mohammad Siraj Shut Down Dating Rumours with bollywood legendary singer Asha Bhosle s Grand daughter Zanai

కాగా.. ఈ ఏడాది సమ్మర్‌లో జరగనున్న ఐపీఎల్ 2025 సీజన్‌లో మహ్మద్ సిరాజ్‌ గుజరాత్ టైటాన్స్ తరపున బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. గతేడాది జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సిరాజ్‌ను ఏకంగా రూ. 12.25 కోట్లు వెచ్చించి గుజరాత్ జట్టు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి జనై భోస్లే గుజరాత్ టైటాన్స్ జట్టు అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఫాలో అవుతుండటం, సిరాజ్‌తో సన్నిహితంగా ఉండటంతో డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో సిరాజ్‌ - జనైలు స్పందించడంతో ఈ వ్యవహారానికి తెరపడినట్లయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X