JGM: డిఫెన్స్ మినిష్టర్ వరకు వెళ్లిన పూరి టీమ్.. న్యూ లుక్ తో అదరగొట్టిన రౌడి స్టార్
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన మొదటి పాన్ ఇండియా మూవీ లైగర్ త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఇంకా విడుదల కాకముందే అదే దర్శకుడితో మరో సినిమా మొదలుపెట్టాడు. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్టు అయినటువంటి జనగణమన ప్రాజెక్టును ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాపై మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు ముందుగానే బాలీవుడ్ మీడియాకు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.
Recommended Video

ఇక ప్రత్యేకంగా చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల డిఫెన్స్ మినిస్టర్ కలుసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న లైగర్
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల ఆ సినిమా షూటింగ్ పనులు మొత్తం కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రకాల పనులు కూడా తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫైనల్ గా సినిమాను ఆగస్టు 25న విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ కూడా ఇచ్చేశారు.

పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ JGM
అయితే ఆ సినిమా విడుదల కాకముందే పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాడు. విజయ్ దేవరకొండ తో మంచి స్నేహం ఏర్పడడంతో అతనయితే ఈ కథకు తప్పకుండా న్యాయం చేయగలడని జనగణమన కథను రౌడీ స్టార్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా మార్చినట్లు తెలుస్తోంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వార్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు JGM అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా పాన్ ఇండియా రేంజ్ ల్ కు తగ్గట్లుగా సినిమా రూపొందిస్తున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు.

డిఫెన్స్ మినిస్టర్ తో..
ఇక మంచి కంటెంట్ ఉన్న కథను తెర పైకి తీసుకు వస్తూ ఉండటంతో చిత్ర యూనిట్ సభ్యులకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఇక రీసెంట్ గా చిత్ర యూనిట్ సభ్యులు డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ను కూడా ప్రత్యేకంగా కలవడం జరిగింది. బుధవారం సాయంత్రం ఢిల్లీలో హీరో విజయ్ దేవరకొండ తో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్ సహనిర్మాత ఛార్మి అలాగే మరికొంతమంది టెక్నీషియన్స్ రాజ్ నాథ్ సింగ్ ను ప్రత్యేకంగా కలిసి సినిమా గురించి మాట్లాడడం జరిగింది.

రౌడి స్టార్ స్టైలిష్ లుక్
ఇక ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తన స్టైలిష్ లుక్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కు సంబంధించిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఫార్మల్ అండ్ స్టైలిష్ డ్రెస్ లో విజయ్ దేవరకొండ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు అంటూ నెటిజన్లు పాజిటివ్ గా పని చేస్తున్నారు. చూస్తుంటే రాబోయే రోజుల్లో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మార్కెట్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











