NTR 30 కోసం రంగంలోకి దిగిన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్.. హీరోతో అలా స్పెషల్ చిట్ చాట్!

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల గ్రాండ్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా కొనసాగుతోంది. ఇక సినిమాను దర్శకుడు కొరటాల శివ ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే తెరపైకి తీసుకురాబోతున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే మోషన్ పోస్టర్ తో అంచనాల స్థాయిని ఒక్కసారిగా పెంచేశారు.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు అని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇక సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ ప్రముఖ నటుడు నటించబోతున్నాడు అని కూడా అనేక రకాల వార్తలొచ్చాయి. ఇక మొత్తానికి అవి నిజమని నేటితో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సైఫ్ అలీ ఖాన్ నేడు ప్రత్యేకంగా చిత్ర యూనిట్ ని కలిశాడు.

Team NTR 30 welcomes saif ali khan on board latest pics viral

రామోజీ ఫిలిం సిటీ లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇక ఈ షూటింగ్లో పాల్గొనేందుకు సైఫ్ అలీఖాన్ కూడా రంగంలోకి దిగాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివను కలుసుకున్న ఫోటోలను కూడా విడుదల చేశారు. నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు అని ఇక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా కొనసాగుతుంది అని కూడా చిత్ర నిర్మాణ సంస్థ ఒక వివరణ ఇచ్చింది.

ఒక ఫోటోలో అయితే జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు కూడా ప్రత్యేకంగా చాట్ చేసుకుంటున్నాట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలో రావణాసుర పాత్రలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కూడా అతను భయంకరమైన విలన్ గా కనిపించబోతున్నాడు.

దర్శకుడు కొరటాల శివ విలన్ పాత్రలను ఏ స్థాయిలో చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఈ పాత్రను చేయడానికి ఒప్పుకున్నాడు అంటే తప్పకుండా ఆ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండే ఉంటుంది అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X