నాగ చైతన్య, సమంత 'మజిలీ'.. రొమాంటిక్ పోస్టర్‌తో ఆ విషయం ప్రకటించారు!
రియల్ లైఫ్ కపుల్స్ అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం తర్వాత జంటగా నటిస్తున్న తొలి చిత్రం మజిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేమ, కుటుంబ బంధాలు ప్రధానంగా ఈచిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సమంత, చైతు భార్య భర్తలుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసింది.
ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఉదయం 9:09 గంటలకు మజిలీ చిత్ర టీజర్ విడుదల కానుంది. సమంత, నాగ చైతన్య బస్సులో ప్రయాణిస్తున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. నటి దివ్యాన్ష కౌశిక్ ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తోంది. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వరుస పరాజయాలతో సతమతమవుతున్న చితుకు మజిలీ చిత్రం విజయం సాధించడం చాలా అవసరం. చైతు చివరగా నటించిన సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు చిత్రాలు నిరాశపరిచాయి. ఇక సమంత, చైతు ఆన్ స్క్రీన్ పై సూపర్ హిట్ జోడి. వీరిద్దరూ జంటగా నటించిన ఏ మాయ చేశావే, మనం లాంటి చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ వేసవిలో మజిలీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











