బంగారం కొనాలా? వెండిలో పెట్టుబడి పెట్టాలా? తేజా సజ్జా సలహా ఏమిటంటే?

బంగారం, వెండి అభరణాలు అంటే తెలుగు వారికే కాకుండా భారతీయులకు చాలా మక్కువ. జేబులో డబ్బు ఉన్నా లేకపోయినా ఒంటిపై వీసమెత్తు బంగారమైనా ఉండాలని ప్రతీ ఒక్కరు కోరుకొంటారు. అయితే ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. గోల్డ్, సిల్వర్ ధరలు రికార్డు స్థాయిలో ఉన్న వాటికి ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనాలా? వెండిపై పెట్టుబడి పెట్టాలా? అనే సందేహాలు అందరికీ ఉంటాయి. ఈ క్రమంలో హనుమాన్, మిరాయి సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకొన్న తేజా సజ్జా ఇచ్చిన సలహా అందర్నీ ఆకట్టుకొంటున్నది. బంగారం, వెండిలో ఏది బెటర్ అనే విషయంపై తేజా ఇచ్చిన సలహా ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

బిజినెస్ వర్గాల్లో బంగారం, వెండి ధరలు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే బంగారాన్ని, వెండిని కొనడానికి ఆభరణాల ప్రియులు వెనుకాడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు తారలు తేజా సజ్జా, మీనాక్షి చౌదరీ ఓ సిల్వర్ జ్యువెల్లరీ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సిల్వర్, బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదే అని చెప్పారు.

Teja Sajja best advice to invest and buy Gold and Silver ornaments

ముఖ్యంగా ఆభరణాలు కొనాలనుకొంటే.. తమ జేబులో, బ్యాంకులో ఉన్న డబ్బును దృష్టిలో పెట్టుకోవాలి. అదనపు భారం పడకుండా తక్కువ డబ్బుతో సిల్వర్ కొనుక్కోవడం ఉత్తమం. బంగారానికి సమానంగా సిల్వర్‌కు డిమాండ్ ఉంది. బంగారం ధరతో పోల్చుకొంటే సిల్వర్‌ను తక్కువగా అంచనా వేయొద్దు అని తేజా సజ్జా అన్నారు. కానుకలు ఇవ్వాల్సి వస్తే.. ఎదుటి వారి అభిరుచిని బట్టి గఫ్టులు ఇవ్వాల్సి ఉంటుంది అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

తేజా సజ్జా, మీనాక్షి చౌదరీ సిల్వర్ జ్యువెల్లరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. కంపెనీ తరఫున వారిద్దరూ సిల్వర్ ప్రాముఖ్యత గురించి వివరించారు. పొదుపు చేసేందుకున పెట్టుబడి పెట్టడానికి వెండి అభరణాల కొనుగోలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన మీడియా సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

తేజా సజ్జా కెరీర్ విషయానికి వస్తే.. హనుమాన్, మిరాయ్ సినిమాల విజయంతో మరోసారి పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జై హనుమాన్ సినిమాతోపాటు మరికొన్ని చిత్రాల్లో నటించనున్నారు. మీనాక్షి చౌదరీ సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒకరాజు సినిమాలతో సక్సెస్‌ను ఖాతాలో వేసుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X