Teja Sajja: రామ్‌చరణ్‌కు రాజమౌళి.. రవితేజకు పూరీ జగన్నాథ్.. తేజకు ప్రశాంత్ వర్మ

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా హనుమాన్. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ.. ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా కోసం ఫ్యామిలీ అడియన్స్, యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది.

తేజ సజ్జా మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి, మెగా అభిమానులకు సినిమా అభిమానులకు అందరికీ నమస్కారం. వెనకాల అంజనీ పుత్రుడు, ముందు అంజనీ పుత్రుడు ఉన్నప్పుడు భయంగా ఉంది. ఎలాగోలా మాట్లాడేస్తాను. మా హనుమాన్ సినిమాను ఆదుకునేందుకు మా హనుమాన్ చిరంజీవి గారు వచ్చారు. నా జీవితంలో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే.. మా మదర్, ఫాదర్ తర్వాత చిరంజీవి గారికే.. ఆయన్ని చూస్తు పెరిగాను.. ఆయన్ని చూస్తూ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆయనకు నేను ఏకలవ్య శిష్యుడిని... అంటూ చెప్పుకువచ్చాడు.

Recommended Video

Ram Charanకి ఉన్నట్టే Teja Sajja వెనుక కూడా ఒక Power House | Hanuman | Telugu Filmibeat

Teja Sajja Comments on Chiranjeevi and Prashanth Varma HanuMan Movie Prerelease Event Full Details Here

చిరంజీవి గారు నా జీవితంలో లేకపోతే.. నేను ఇక్కడ ఉండకపోదును. నా ఉనికికి నా ఉన్నతకు కారణం అయినా చిరంజీవి గారికి పాదాభివందనం సార్. నేను చిరంజీవి గారితో నాలుగు సినిమాలు చేశాను. నన్ను ఇంట్లో పిల్లలతో చూశారు. ఆయనకు ఎప్పటికి హంబుల్ గా ఉంటాను.. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే.. ఆయన కన్న కల ఇది. ఆయన నన్ను ఆయుధంగా వాడి రామబాణంలా ఇండస్ట్రీలోకి వదిలాడు. నన్ను ఇవాళ సూపర్ హీరోను చేసి ఇక్కడ నిలబెట్టాడు.. అంటూ చెప్పుకువచ్చాడు.

రామ్ చరణ్ తేజకు రాజమౌళి గారు... రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు.. నాకు ఈ తేజ గాడికి ప్రశాంత్ వర్మ.. నేను ఒక ఉత్సవ విగ్రహంలా ఉన్నాను.. ఇదంతా ఆయనే క్రెడిట్.. అంటూ చెప్పుకువచ్చాడు. ఇక నిర్మాత నిరంజన్ రెడ్డి నన్ను ప్రశాంత్ ను నమ్మి చేశాడు. ఇక ఈ సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు ఆడాలి.. అందులో హనుమాన్ కూడా ఉండాలి. నేను కోరుకుంటున్నాను.. ఈ హనుమాన్ అనే సినిమా ఓ సూపర్ హీరో సినిమా.. ఒక బలహీనుడికి హనుమంతుడు పవర్స్ వస్తే.. ఎంటనేది సినిమా.. అందరూ వచ్చి చూడండి అంటూ చెప్పుకువచ్చాడు.

Teja Sajja Comments on Chiranjeevi and Prashanth Varma HanuMan Movie Prerelease Event Full Details Here

ఇక ఈ సినిమాలో గుస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉంటాయి. అందరికీ థ్యాంక్స్ అంటూ చెప్పుకువచ్చాడు. ఇక హనుమాన్ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌ తో సహా 11 భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X