HanuMan: ప్రశాంత్ వర్మ ఆఫీసుకు రియల్ హనుమాన్... పోస్ట్ వైరల్!
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. హనుమాన్ చిత్రంతో నేషనల్ వైడ్ క్రేజ్ కొట్టేశాడు. ఇక ఈ చిత్రం సూపర్ హిట్ దిశగా ముందుకు వెళ్తుంది. మొదటి ఆట నుంచి ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు క్రిటిక్స్. అటు ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. ఇదిలా ఉంటే హనుమాన్ సినిమాను ఆశీర్వదించడానికి రియల్ హనుమాన్ వచ్చాడు. ఇక ఈ ఫోటోను సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ వర్మ పంచుకున్నాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సూపర్ హీరో చిత్రం హనుమాన్. ఇక ఈ చిత్రం జనవరి 12న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయి సూపర్ సక్సెస్ దిశగా కొనసాగుతోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా వినయ్ రాయ్ నటించగా హీరోయిన్ గా అమృత అయ్యార్ నటించింది. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

హనుమాన్ చిత్రంలో ప్రతి ఒక్కరు వందకు 1000 శాతం ఎఫర్ట్స్ ఇచ్చారనే చెప్పాలి. ముఖ్యంగా విజువల్స్ గుస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక గుంటూరు కారం సినిమాకు పోటీగా హనుమాన్ చిత్రం రావడంతో అందరూ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు. కానీ ప్రశాంత్ వర్మ.. తనేంటో ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. సౌత్, నార్త్ ప్రేక్షకులకు హనుమాన్ చిత్రం బాగా నచ్చేసింది. సోషల్ మీడియా వేదికగా మంచి రివ్యూలు ఇస్తున్నారు.
ఒక సాధారణమైన యువకుడికి హనుమంతుని శక్తులు వస్తే.. వాటిని ఊరి ప్రయోజనాల కోసంహీరో వాడటం.. ఆ శక్తులను విలన్ చేజిక్కించుకునేందుకు చేసే విశ్వప్రయత్నాలకుహనుమాన్ వచ్చి ఎలా కాపాడారు.. అనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో ఇంత అద్భుతాన్ని సృష్టించడంతో ప్రశాంత్ వర్మ టేకింగ్ కు హాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్స్.

అయితే తాజాగా ప్రశాంత్ వర్మ తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు అది నెట్టింట వైరల్ గా మారింది. తన ఆఫీసుకు ఎవరో వచ్చారో చూడండి అంటూ ఓ ఫోటోను షేర్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఆ ఫోటోలో ఓ కోతి కనిపిస్తుంది. అయితే ప్రశాంత్ వర్మ ఆఫీసుకు కోతి రావడంతో.. దాన్ని క్లిక్ చేసి... అభిమానులతో పంచుకున్నాడు ప్రశాంత్. ఇక మన దగ్గర హనుమాన్ కు ప్రతి రూపం కోతి. అలా తనను ఆశీర్వదించడానికి రియల్ హనుమాన్ వచ్చినట్లు ప్రశాంత్ వర్మ చెెప్పకనే చెప్పారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీంతో హనుమాన్ ను దీవించడానికి నిజంగా హనుమంతుడే వచ్చాడంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి హనుమాన్ దీవెనలతో ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











