త్వరలోనే తేజా సజ్జా పెళ్లి.. హనుమాన్ హీరో క్లారిటీ ఏమిటంటే?

టాలీవుడ్‌లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja). ప్రస్తుతం కెరీర్‌లో పీక్‌లో ఉన్నాడు. HanuMan తో పాన్ ఇండియా లెవల్‌లో భారీ విజయాన్ని అందుకుని,మిరాయ్ తో మరో హిట్ ఖాతాలో వేసుకున్న ఈ హీరో ఇప్పుడు వ్యక్తిగత జీవితంతో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా ఆయన పెళ్లిపై వస్తున్న రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న తేజ సజ్జా తన పెళ్లి గురించి ఇచ్చిన స్పందన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?

టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'హనుమాన్' సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరగడంతో, వ్యక్తిగత జీవితంపై కూడా చర్చలు మొదలయ్యాయి. ఇటీవల ఒక జ్యువెలరీ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు తేజ సజ్జా.

Teja Sajja Marriage Rumours HanuMan Star Breaks Silence on Wedding Plans

ఈ సమయంలో తేజా సజ్జా రిపోర్టర్ల నుంచి పెళ్లి గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. 'త్వరలోనే మీ పెళ్లి జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. అందుకే జ్యువెలరీ డిజైన్స్ కూడా రెడీ చేస్తున్నారా?'అని అడగగా, ఆయన సరదాగా స్పందించారు. 'ఇది నా పెళ్లి డిస్కషన్ కాదు. నేను పెళ్లి చేసుకోబోతున్నానని ఎక్కడా చెప్పలేదు' అంటూ రూమర్స్‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

అయితే, సిల్వర్ జ్యువెలరీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే, సిల్వర్ జ్యువెలరీ వేసుకోవడంలో ఎలాంటి మొహమాటం లేదు. అది బాగుంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తాను' అని అన్నారు. దీంతో పెళ్లి వార్తలపై క్లారిటీ కూడా ఇచ్చినట్లైంది. ఇక లవ్ లైఫ్‌పై కూడా తేజ స్పందించారు.

'ఎవరైనా ప్రపోజ్ చేస్తే?' అనే ప్రశ్నకు, 'సిల్వర్ ఆర్నమెంట్ గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీలవుతాను. ఎందుకంటే అది లాంగ్ లాస్టింగ్ మెమరీగా ఉంటుంది' అని చెప్పారు. అయితే తనకు ప్రస్తుతం ఎలాంటి లవ్ రిలేషన్ లేదని కూడా స్పష్టం చేశారు. దీంతో ఆయనపై వస్తున్న లవ్ రూమర్స్‌కి కూడా చెక్ పెట్టినట్లైంది.

ప్రస్తుతం తేజ సజ్జా పూర్తిగా తన కెరీర్‌పైనే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా 'జై హనుమాన్' వంటి భారీ ప్రాజెక్ట్‌తో పాటు మరికొన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి కూడా అడుగుపెట్టాడు. ది ట్రైటర్స్ (The Traitors) తెలుగు వెర్షన్‌కు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.హిందీలో కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షోను తెలుగులో ఆయన చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ షో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‍‌లో కరణ్ జోహార్‌తో తేజ సజ్జా ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఇంకా తమిళ దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నానని తేజ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.కోలీవుడ్ ఎంట్రీపై సీరియస్‌గా ఆలోచిస్తున్నానని చెప్పడం, ఆయన కెరీర్‌ను మరింత విస్తరించాలనే ప్లాన్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా చూస్తే.. తేజ సజ్జా పెళ్లి వార్తలు ప్రస్తుతం కేవలం రూమర్స్ మాత్రమే. ఆయన స్పష్టంగా చెప్పినట్టు ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన లేదని తెలుస్తోంది. కెరీర్‌పైనే ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్న తేజ, భవిష్యత్తులో ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Read more about: tollywood teja sajja karan johar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X