ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ ప్రారంభం: ఆ హీరోతోనే జతకట్టిన టాలెంటెడ్ డైరెక్టర్

విలక్షణమైన కథలు.. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. డైరెక్టర్‌గా చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన టేకింగ్‌తో ఎంతో మంచి పేరును సంపాదించుకున్నాడు. అదే సమయంలో కొద్ది రోజుల క్రితం 'జాంబీ రెడ్డి' అనే ప్రయోగత్మక చిత్రాన్ని రూపొందించి భారీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించాడు. తెలుగులో మొట్ట మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమాగా పేరొందిన హనుమంతుడి కథతో 'హనుమాన్' అనే సినిమాను చేయబోతున్నాడీ యంగ్ డైరెక్టర్.

ప్రశాంత్ వర్మ 'హనుమాన్' ప్రాజెక్టును ప్రకటించిన తర్వాత అందులో లీడ్ రోల్ చేసేది ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో ఈ సినిమా అప్పుడే చర్చనీయాంశం అయిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఇక, ఇందులో యంగ్ హీరో తేజ సజ్జానే టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ మేరకు అతడితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. 'మేమిద్దరం మరోసారి' అంటూ చిన్న క్యాప్షన్‌తో మేటర్ రివీల్ చేసేశాడు.

 Teja Sajja - Prasanth Varma HANU-MAN Movie Started

ఇక, తాజాగా జరిగిన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా నిర్మాత సి కళ్యాణ్ క్లాపింగ్ ఇచ్చారు. అలాగే శివశక్తి దత్త ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తేజ సజ్జా పొడవాటి జుట్టుతో దర్శనమిస్తున్నాడు. ఇదే ఈ సినిమా లుక్ అని అర్థం అవుతోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X