నితిన్ టైటిల్ తో రాబోతున్న యువ హీరో.. లవ్ స్టొరీ కాదట!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న తేజ సజ్జ ప్రస్తుతం యువ నటుడిగా బిజీ అవుతున్నాడు. కేవలం సైడ్ రోల్స్ అనే కాకుండా హీరోగా కూడా అవకాశాలను అందుకుంటున్నాడు. ముఖ్యంగా ఓ బేబి సినిమాలో అతను చేసిన పాత్రకు మంచి క్రేజ్ దక్కింది. ఇక నెక్స్ట్ జాంబీ రెడ్డి సినిమాతో హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.
అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్ కు మంచి బజ్ క్రియేట్ అవ్వడంతో సినిమా తప్పకుండా హిట్టయ్యేలా ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు తేజ. మలయాళం హిట్ మూవీ ఇష్క్ సినిమాకు రీమేక్ గా రానున్న ఆ సినిమాని తెలుగులో కూడా అదే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు.

సినిమాకు సంబంధించిన టైటిల్ ను కూడా రిలీజ్ చేశారు. నితిన్ గతంలో ఇదే టైటిల్ తో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే తేజ సినిమా మాత్రం లవ్ స్టొరీ కాదట. రొమాంటిక్ థ్రిల్లర్ గా రాబోతోందట. అదే విషయాన్ని క్యాప్షన్ తో చెప్పేశారు.
మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాతో పాటు తేజ సజ్జ మరో రెండు కొత్త సినిమాలను కూడా ఒకే చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒక సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఈ సంక్రాంతి రానున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











