For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బోల్డ్ సీన్స్.. బోల్డ్ కంటెంట్ చూసి..మసాలా సినిమా అనుకోవద్దు.. కమిట్‌మెంట్‌ ఫంక్షన్‌లో చిత్ర యూనిట్

  |

  రచన మీడియా వర్క్స్ సమర్పణలో , F3 ప్రొడక్షన్స్ , ఫుట్ లూస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్ , తనిష్క్ రాజన్ , అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ సింహా రెడ్డి నటీనటులుగా లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వంలో బల్ దేవ్ సింగ్, నీలిమటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం కమిట్‌మెంట్. సెన్సార్ బోర్డు స‌భ్యుల ప్ర‌శంస‌లతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగష్టు 19 తేదీన థియేటర్‌లో గ్రాండ్‌ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేసింది.

  కమిట్‌మెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో నటుడు అమిత్ తివారి మాట్లాడుతూ..కమిట్‌మెంట్ అంటే అందరూ ఎదో అనుకుంటారు. కానీ కమిట్‌మెంట్ అంటే మన వర్క్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్, ప్రొఫెషన్ కొరకు ఎంత దూరం వెళ్తారు, ఆలా కమిట్‌మెంట్‌తో వెళ్ళినపుడు సొసైటీ‌లో మీ లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్‌ను ఎదుర్కొన్నారు అనేదే ఈ కమిట్‌మెంట్ సినిమా కథ. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు అన్నారు.

  Tejaswi Madivadas Commitment movie youthful Entertainer, says Producers

  చిత్ర నిర్మాత నీలిమ టి మాట్లాడుతూ..ఇది నా మొదటి సినిమా..సొసైటీకి మంచి సినిమా చూపించాలని ఒక మహిళగా మంచి సినిమా తీశాం.ఈ సినిమా పోస్టర్స్ చూసి, క్లిప్పింగ్స్ చూసో అందరూ బోల్డ్ కంటెంట్ ఉంటుంది అనుకోవద్దు. ఇందులో కొంత బోల్డ్ సీన్స్ వున్నా అవి ఎందుకు ఉన్నాయి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ నెల 19 తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.

  Tejaswi Madivadas Commitment movie youthful Entertainer, says Producers

  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ద్వారాకేష్ మాట్లాడుతూ. కోవిడ్ వలన నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ఇలాంటి మంచి సినిమా ను చెప్పగానే ఒప్పుకిని చేసిన నిర్మాతలు బలదేవ్, నీలిమ, అనిల్ గార్లకు ధన్యవాదాలు. నాలుగు కథలు స్టోరికి నటీనటులందరూ ఫుల్ సపోర్ట్ చేస్తూ చాలా చక్కగా తీశారు. ఇందులో ఉన్న నాలుగు కథలు సొసైటీలో జరిగేవే. ఈ కథలను తెరపై తెస్తున్న ఈ సినిమా సొసైటీకి బాగా యూజ్ ఫుల్ అవుతుంది అని అన్నారు

  నటుడు కెవ్వు కార్తీక్ మాట్లాడుతూ.. ఈ సొసైటీ లో జరుగుతున్న రియల్ లైఫ్ లో జరుగుతున్న ప్రతి సందర్భాన్ని మీరు థియేటర్స్ కు వెళ్తే మీ కళ్ళముందు కనబడుతుంది. ట్రైలర్ చూసి ఇది మంచి మాస్ మసాలా సినిమా అనుకుంటారు. కానీ ఇందులో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్న మంచి సందేశంతో తెరకెక్కించారు అని అన్నారు.

  హీరోయిన్ తనిష్క్ రాజన్, నటుడు యావర్ అహమ్మద్, నటుడు సూర్య శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ.. ఇది పక్కా ఇది పైసా వసూల్ సినిమా అవుతుంది అని అన్నారు.

  న‌టీనటులు: తేజస్వి మడివాడ, రమ్య పసుపులేటి ,సీమర్ సింగ్ ,అన్వేషి జైన్ ,తనిష్క్ రాజన్ ,అమిత్ తివారి ,సూర్య శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్ , అభయ్ రెడ్డి , తన్కిష్క్ జైన్ , రాజా రవీంద్ర తదితరులు
  బ్యానర్: ఎఫ్ 3 ప్రొడక్షన్స్ , ఫుట్ లూస్
  నిర్మాతలు: నీలిమ తాడూరి, బల్దేవ్ సింగ్
  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్న
  సంగీతం: నరేష్ కుమారన్
  సినిమాటోగ్రఫి: సాజీశ్ రాజేంద్రన్ , నరేష్ రాణా ,
  ఎడిటర్: ప్రవీణ్ పూడి
  ఆర్ట్: సుప్రియ బత్తెపాటి
  లిరిక్స్: పూర్ణ చారి ,గాంధీ
  కొరియోగ్రఫీ: హరికిరణ్
  కో- డైరెక్టర్: మెహర్
  పీఆర్వో: శ్రీపాల్ చొల్లేటి

  English summary
  Tejaswi Madivada's Commitment movie set to release on August 19th. Here is producers opinion on the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X