బిగ్‌బాస్ బ్యూటీ కమిట్మెంట్.. ఇప్పుడే ఇలా ఉంటే ఇక అప్పుడు! కిక్కంటే ఇదేలే..
ట్రెండ్ మారింది.. కాలం వేగంగా పరుగెడుతోంది. యూత్ అంతా స్పీడ్ అయిపోయారు. కాలంతో పాటు మోడ్రన్ యుగాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకనిర్మాతలు సైతం యూత్‌ని ఆకర్షించే సినిమాలే తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే ఆలోచనతో రాబోతున్న రొమాంటిక్ మూవీ 'కమిట్మెంట్'. ఈ సినిమా అప్‌డేట్స్ యువతలో వేడి పుట్టిస్తున్నాయి.

వరుస పోస్టర్స్.. అబ్బో! మ్యాటర్ బాగానే ఉంటుందిలే
ఓ వైపు 'కమిట్మెంట్' మూవీ చిత్రీకరణ పూర్తిచేస్తూనే మరోవైపు ఓ రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు యూత్‌ని ఆకర్షించేలా పలు అడల్ట్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా విడుదలైన పోస్టర్స్ చూస్తుంటే అబ్బో! మ్యాటర్ బాగానే ఉంటుందిలే.. అనిపిస్తోంది.

ప్రీ లుక్.. ఫస్ట్‌లుక్ అప్‌డేట్
తాజాగా 'కమిట్మెంట్' నుంచి ప్రీ లుక్ విడుదల చేసి ఫస్ట్‌లుక్ అప్‌డేట్ ఇచ్చారు దర్శకనిర్మాతలు. ఈ లుక్‌లో నలుగురు అమ్మాయిల కాళ్ళు మాత్రమే చూపిస్తూ మత్తెక్కించారు. ఈ మేరకు 'కమిట్మెంట్' ఫస్ట్‌లుక్ మార్చి 7వ తేదీన విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

బిగ్ బాస్ బ్యూటీ 'కమిట్మెంట్'
'కమిట్మెంట్' మూవీ నలుగురు అమ్మాయిల విభిన్న కథల ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బిగ్‌బాస్ బ్యూటీ తేజస్వి మడివాడ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రాన్ని ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Recommended Video


బెడ్ పై పడుకొని అలా.. తేజస్వి షాకింగ్ పిక్
ఈ మూవీలో తేజస్వి చాలా బోల్డ్ క్యారెక్టర్ చేస్తుందని తెలిసింది. ఇప్పటివరకు విడుదలైన కమిట్మెంట్ స్టిల్స్ చూస్తుంటే ఈమె ఎంత హాట్‌గా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇప్పటికే బెడ్ పై పడుకొని ఉన్న ఓ పోస్టర్ షేర్ చేసిన తేజస్వి.. కమిట్మెంట్ హంగామా ఎలా ఉండనుందో చెప్పకనే చెప్పేసింది.


Click it and Unblock the Notifications











