Adipurush: అభిమానలకు గుడ్ న్యూస్.. మొత్తం ఆరు షోలు.. టిక్కెట్ల రేట్లు ఎంత పెంచారంటే..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రేక్షకులు కూడా సిల్వర్ స్క్రీన్ పై త్రీడీలో రామాయణం చూడాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా తెలుగు రైట్స్ ని భారీ ధరకి కొనుగోలు చేసి ఏరియా వైజ్ గా అమ్మేసింది.
గత నెల నుంచి టాలీవుడ్ లో సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు. వచ్చినవన్నీ చిన్న చిత్రాలే. ఇప్పుడు ఆదిపురుష్ తో హౌస్ ఫుల్ బోర్డులు చూసే అవకాశం రానుంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలలో బయ్యర్ల అభ్యర్ధన మేరకు ఆదిపురుష్ మూవీకి సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రెట్లపై 50 రూపాయిలు అదనంగా వసూలు చేసుకోవడానికి ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి. తెలంగాణలో మూడు రోజుల పాటు ఈ 50 రూపాయిల అదనపు రుసుముతో త టికెట్లు అమ్ముకోవచ్చు.

ఇక మొదటి రోజు బెన్ ఫిట్ షోతో కలిపి ఆరు షోలు వేసుకోవడానికి కూడా పర్మిషన్ దొరికింది. ఉదయం 4 గంటల నుంచి ఆదిపురుష్ షోలు రెండు రాష్ట్రాలలో స్టార్ట్ అయిపోతాయి. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుందని గట్టి నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు. బయ్యర్లు కూడా మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో మల్టీప్లెక్స్ లో టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి.
అక్కడ టికెట్ రేటు అదనంగా 50 వేసిన 170 రూపాయిలు దాటదు. ఓ విధంగా ఇది పెద్ద భారమైతే కాదు. కాబట్టి ప్రేక్షకులు ఫ్యామిలీ తో కలిసి సినిమా చూడటానికి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో కొంత భారమైన అది మొదటి మూడు రోజులు మాత్రమే ఉంటుంది.

పాజిటివ్ టాక్ వస్తే తరువాత ఆడియన్స్ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ఈ నెల ఆఖరు వరకు చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ కూడా లేవు కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ప్రభాస్ ఇమేజ్, రామాయణం మీద ఉన్న అభిమానం, త్రీడీ టెక్నాలజీ వెరసి వార్ సీక్వెన్స్ ని హైలైట్ గా చేసుకొని ఆదిపురుష్ చిత్రాన్ని ఓం రౌత్ ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో సరికొత్తగా రామాయణాన్ని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించే అవకాశం ఉందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











