బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వాలు.. బన్నీ, సూపర్ స్టార్స్ ఫ్యాన్స్‌కు ఇక పండగే

సంక్రాంతి సందడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా ఉంటుందో.. థియేటర్ల వద్ద అభిమానుల సందడి అతే ఉంటుంది. టాలీవుడ్ బాక్సాఫీస్‌కు సంక్రాంతి సీజన్ కలిసి వస్తుంది. అందుకు తెలుగు స్టార్ హీరోలు సంక్రాంతిపై కన్నేస్తారు. ఈ క్రమంలో రెండు మూడు పెద్ద సినిమాలు బరిలోకి దిగుతాయి. ఎంత మంది పోటీలో దిగిన సరైన చిత్రాలు పడితే మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేవాల్సిందే. కనక వర్షంతో నిర్మాతల జేబులు నిండాల్సిందే.

ఈ సంక్రాంతికి తీవ్ర మైన పోటీ..

ఈ సంక్రాంతికి తీవ్ర మైన పోటీ..

ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అలవైకుంఠపురములో చిత్రంతో పోటీలోకి దిగుతున్నారు. కళ్యాణ్ రామ్ ఎంతమంచివాడవురా కూడా పోటీలో ఉన్నా ప్రధానంగా ఆ రెండు చిత్రాల మధ్యే నడుస్తోంది.

ఇప్పటికే రెంటిపై భారీ హైప్..

ఇప్పటికే రెంటిపై భారీ హైప్..

ఇప్పటికే సరిలేరు, అల వైకుంఠపురములో చిత్రాలపై భారీ హైప్ క్రియేట్ కాగా.. రెండూ పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. సోషల్ మీడియాలో రెండూ కూడా ట్రెండింగ్ అవుతుండగా.. ఇరువురి ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పాటలతో అల వైకుంఠపురములో హల్ చల్ చేస్తుండగా.. టీజర్, ట్రైలర్‌లతో సరిలేరు దుమ్ములేపుతోంది.

ప్రభుత్వాల నుంచి బంపర్ ఆఫర్

ప్రభుత్వాల నుంచి బంపర్ ఆఫర్

ఇరు ప్రభుత్వాలు ఈ సినిమాలకు బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ ముగిసే వరకు రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు పర్మిషన్ ఇచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఈ రెండు చిత్రాలు బాగానే రాబట్టే అవకాశముంది.

ఫ్యాన్స్‌కు ఇక పండుగే..

ఫ్యాన్స్‌కు ఇక పండుగే..

రోజుకు ఐదు ఆటలంటే అభిమానులక ఇక పండగే.. కలెక్షన్లలోనూ రెండు చిత్రాలు కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. గత కొంత కాలం నుంచి అదనపు షోలకు పర్మిషన్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ చిత్రాలకు ఓకే చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయం. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురములో బరిలోకి దిగేందుకు సిద్దమయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X