అల్లు అర్జున్ ఇంటిపై దాడులు.. రేవంత్ రెడ్డి సీరియస్ పోస్ట్.. ఏమన్నారంటే?
గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ఏపీలో తన ఫ్రెండ్ కోసం పొలిటికల్ గా ఎప్పుడైతే సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసాడో అక్కడ నుంచి ఆయనకి రాజకీయాల పరంగా ఏదొక కాంట్రవర్సీ ఎదురవుతూనే వస్తుంది అని చెప్పాలి.
మెయిన్‌గా ఏపీలో శిల్ప రవికి సపోర్ట్ చేసిన తర్వాత తాను చేసిన పలు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా అభిమానుల నడుమ పెద్ద గొడవలు తీసుకురాగా అది కాస్తా చిలికి చిలికి గాలి వాన అయ్యింది. ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే లేటెస్ట్‌గా ఆయన నటించిన సినిమా పుష్ప 2 రిలీజ్‌కి ఇచ్చిన హైక్స్‌కి గాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి స్పెషల్ థాంక్స్ చెప్పడం కొంచెం పాజిటివ్ గా మారింది.

ఏపీ వరకు అక్కడ సెట్ అయ్యింది అనుకునే లోగా అల్లు అర్జున్ తెలంగాణ రాజకీయాల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట నేపథ్యంలో ఇప్పుడొక మినీ యుద్ధమే అక్కడ నడుస్తుంది. ఓ పక్క అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం , బయటకి వచ్చాక స్వయంగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తే తనపై మాట్లాడటం కలకలం రేపింది. దీనిపై స్వయంగా అల్లు అర్జున్ షాకింగ్ ప్రెస్ మీట్ పెట్టడంతో ఓ రేంజ్‌లో హై టెన్షన్ వాతావరణం కనిపించింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్ధితుల్లో ఏకంగా అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగడం కలకలం రేగింది. ఇది పెద్ద వార్తగా మారగా అల్లు అర్జున్ తండ్రి, టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఈ ఘటనపై చింతిస్తూ సంయమనం పాటిస్తామని హామీ ఇచ్చారు. ఈ దాడుల విషయం ఇంకా పెద్దది అవుతున్న నేపథ్యంలో ఏకంగా దీనిపై ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన పోస్ట్ కొంచెం ఊరట ఇచ్చింది అని చెప్పాలి.
సోషల్ మీడియా వేదికగా తన మాటగా సీరియస్ స్పందనను అల్లు అర్జున్ అనే కాదు టోటల్ తెలుగు సినిమా హీరోస్ కోసం అందించారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే .. " సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను.
ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి." అంటూ శాంతి భద్రతల విషయంలో కొంచెం ఘాటుగానే స్పందించారని చెప్పాలి. అలాగే సినీ ప్రముఖుల విషయంలో తమ ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఇది ఓ రకంగా టాలీవుడ్‌కు రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్టే అని కూడా చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











