టాలీవుడ్ కు రేవంత్ సైన్యం వార్నింగ్.. ఆ విషయంలో ఉక్కుపాదం మోపబోతున్నారా?

గడిచిన ఈ కొన్ని సంవత్సరాలలో తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు అలాగే రాజకీయాలు వేరు వేరు కాదు ఒకటే అన్నట్టుగా ఏపీలో జరిగిన షాకింగ్ ఘటనలు చూస్తే అర్ధం అయ్యింది. కాగా ఈ తర్వాత ఏపీలో ప్రభుత్వం మారి సినిమాకి చెందిన ప్రముఖ హీరోనే అక్కడ ఉప ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు.

సరే ఇది బాగానే ఉంది ఏపీలో ఇక టాలీవుడ్ కి కానీ టాలీవుడ్ హీరోలు లేదా హీరోయిన్స్ కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఖరారు అయ్యిపోయింది. కానీ ఇపుడు ఊహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అంతా మారుతూ వస్తుంది. కాగా గతంలో ఏపీలో జరుగుతున్నట్టుగా ఇప్పుడు తెలంగాణ సైడ్ నుంచి జరుగుతుంది అనిపిస్తుంది.

telangana cm revanth sainyam open warning for tollywood

అప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రముఖ నాయకుల మనుషులు అతన్ని తన కుటుంబంలో ఆడవాళ్ళని కూడా ఎంత దారుణంగా మాట్లాడారో అందరికీ తెలుసు. ఇపుడు తెలంగాణాలో అక్కినేని నాగార్జున కుటుంబం అలాగే హీరోయిన్ సమంత పేర్లతో పెద్ద రచ్చ నడుస్తుంది.

కాగా ఏపీలో జరిగిన పలు షాకింగ్ మార్పులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మేజర్ గా తెలుగు సినిమా అంతా తెలంగాణ హైదరాబాద్ లోనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు హీరోలు అంతా కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. కాగా గతంలో ఎన్నోసార్లు డ్రగ్స్ కేసుల కలకలం కూడా జరిగింది.

అయితే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాలూకా సోషల్ మీడియా విభాగంగా రేవంత్ సైన్యం అన్నట్టుగా సోషల్ మీడియాలో కొందరు టాలీవుడ్ పట్ల మున్ముందు జరిగే చర్యలపై షాకింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. డ్రగ్స్ కేసులు మళ్ళీ తీస్తామని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చడమే థ్యేయం అని గట్టిగా చెబుతున్నారు.

అలాగే హీరోలకి, హీరోయిన్స్ కి భయపడే ప్రభుత్వం ఇది కాదు పేద, మధ్య తరగతి కుటుంబం ఆడియెన్స్ కూడా సినిమాలు చూసేలా టికెట్ ధరలు 100 రూపాయలకి నియంత్రిస్తాం అని ఇది ఓపెన్ హెచ్చరికే అంటూ పోస్ట్ చేశారు. దీనితో రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి డెఫినెట్ గా మరింత స్థాయిలో టాలీవుడ్ విషయంలో ఉక్కుపాదం మోపే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది అని చెప్పాలి.

కాగా వీటిలో డ్రగ్స్ వరకు ఓకే కానీ టికెట్ ధరల విషయంలో మళ్ళీ నిర్మాతలకి ఇక్కట్లు తప్పేలా లేవని చెప్పాలి. గతంలో టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం చుట్టూ హీరోలు అలాగే నిర్మాతలు కూడా ఎంతలా తిరిగారో అందరికీ తెలుసు. పైగా ఈ టికెట్ ధరల పెంపు తగ్గింపు అంశంలో చాలామందిలో భిన్నాభిప్రాయాలు లేకపోలేవు. మరి చూడాలి మళ్ళీ తెలుగు సినిమా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటుంది అనేది. అలాగే ఒకవేళ ఇదే మార్పులు జరిగితే ఈసారి నిర్మాతలు హీరోలు ఎలా స్పందిస్తారో అనేది కూడా చూడాలి.

More from Filmibeat

Read more about: tollywood revanth reddy nagarjuna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X