Gaddar Film Awards : గద్దర్ ఫిలిం అవార్డ్స్ విజేతలు వీరే.. చిరంజీవికి ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు..

Gaddar Film Awards : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించిన విజేతల తుది జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ప్రజా గాయకుడు, విప్లవ కవి గద్దర్ పేరిట ఈ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన విజేతల జాబితాను తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి, నటి రోజా రమణి, సంగీత దర్శకుడు మణిశర్మ, నటి ప్రగతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జ్యూరీ చైర్మన్‌గా ఉన్న మణిశర్మ ఆధ్వర్యంలో అవార్డు విజేతల జాబితాను అధికారికంగా ప్రకటించారు.

చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు..
ఈసారి గద్దర్ ఫిలిం అవార్డ్స్‌లో మెగాస్టార్ చిరంజీవి కు ప్రతిష్ఠాత్మకమైన ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రకటించారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటిగా పేరు పొందిన జయసుధ కు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) అవార్డు ప్రకటించారు. అలాగే సినీ రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు ఇతర ప్రత్యేక పురస్కారాలను కూడా ప్రకటించారు.

Telangana Gaddar Film Awards 2025 Winners Full List Special Awards for Chiranjeevi and Jayasudha

17 విభాగాల్లో అవార్డులు
ఈ ఏడాది గద్దర్ ఫిలిం అవార్డ్స్‌ను మొత్తం 17 విభాగాల్లో అందజేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా సామాజిక సందేశం ఉన్న చిత్రాలకు ప్రత్యేక అవార్డులు ప్రవేశపెట్టడం ఈసారి ప్రత్యేకతగా నిలిచింది. అలాగే డాక్టర్ సినారే, ఏఎన్ఆర్ పేర్లతో ప్రత్యేక పురస్కారాలను కూడా చేర్చారు. దాదాపు 14 సంవత్సరాల విరామం తర్వాత ఒకప్పుడు అందజేసే నంది అవార్డుల స్థానంలో ఈ గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినట్లు వెల్లడించింది.

స్పెషల్ అవార్డులు:
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు- మెగాస్టార్ చిరంజీవి
పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు - కమల్ హాసన్
బి.ఎన్.రెడ్డి ఫిల్మ్ అవార్డు- సింగీతం శ్రీనివాసరావు
గిరెడ్డి అండ్ చక్రపాణి అవార్డు - చలసాని అశ్వనీదత్
కాంతారావు అవార్డు - ఆర్‌ నారాయణమూర్తి
రఘుపతి వెంకయ్య అవార్డు - రమేష్ ప్రసాద్ (ప్రసాద్ ల్యాబ్స్)
సి. నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డు - సుద్దాల అశోక్ తేజ
అక్కినేని నాగేశ్వర్ రావు ఫిల్మ్ అవార్డు- జయసుధ

గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 విజేతలు:

ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
ఉత్తమ చిత్రం:రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం: దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం: ది ప్రీ వెడ్డింగ్ షో

టెక్నికల్ విభాగాలు:
ఉత్తమ దర్శకుడు: సాయిలు ( రాజు వెడ్స్ రాంబాయి )
ఉత్తమ సపోర్టింగ్ నటుడు: శివాజీ
ఉత్తమ సపోర్టింగ్ నటి: భూమిక
ఉత్తమ సంగీత దర్శకుడు:మార్క్ కె రాబిన్ ( దండోరా )
ఉత్తమ నేపథ్య గాయకుడు: అనురాగ్ ( రాజు వెడ్స్ రాంబాయి )
ఉత్తమ నేపథ్య గాయని: సాహితి చాగంటి ( కన్నప్ప )
ఉత్తమ హాస్యనటుడు: కృష్ణ తేజ ( జిగ్రీస్)
ఉత్తమ బాలనటుడు: రోహన్ రాయ్ ( ప్రీ వెడ్డింగ్ షో )
ఉత్తమ కథా రచయిత:గుణశేఖర్ (యుఫోరియా )
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: అనిల్ రావిపూడి
ఉత్తమ గేయ రచయిత: నందకిశోర్ ( కుబేర )
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: కార్తిక్ ఘట్టమనేని ( మిరాయ్)
ఉత్తమ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్: ఎం.ఆర్. రాధాకృష్ణన్ ( కిష్కిందపురి)
ఉత్తమ కొరియోగ్రాఫర్: గిర గిర గిర
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి (చాంపియన్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: గోవింద్ (అఖండ)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: చంద్రకాంత్ (చాంపియన్)

ప్రత్యేక జ్యూరీ అవార్డులు:
స్పెషల్ జ్యూరీ అవార్డు: రాజ్ రాచకొండ (23)
ఉత్తమ మేల్ యాక్టర్: చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి )
ఉత్తమ నటి: అనంతిక ( 8 వసంతాలు )
స్పెషల్ జ్యూరీ హీరో: రోషన్ ( చాంపియన్ )

నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా: తండేల్
పర్యావరణ / వారసత్వ చిత్రం: ఇగ్వా
ఉత్తమ డెబ్యూ చిత్రం: లిటిల్ హార్ట్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం
సామాజిక సందేశం ఉన్న చిత్రం: కోర్టు
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ: మిరాయ్
ఉత్తమ బాలల చిత్రం: అనగనగనా

గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రదానోత్సవాన్ని మార్చి 19, 2026న ఉగాది పండుగ సందర్భంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, కళాకారులు, రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి గద్దర్ ఫిలిం అవార్డ్స్ ముఖ్యమైన వేదికగా నిలవనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X