Telangana Gaddar Film Awards: అల్లు అర్జున్‌కి రేవంత్ రెడ్డి హగ్.. అన్నగారంటూ బన్నీ.. ఈవెంట్‌కే హైలైట్‌గా

నంది అవార్డ్స్ స్థానంలో తెలంగాణ ప్రభుత్వం గద్ధర్ ఫిల్మ్ అవార్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2014 నుంచి 2024 వరకు పలు చిత్రాలకు నటీనటులకు దిల్‌రాజు పర్యవేక్షణలో జయసుధ, మురళీ మోహన్‌‌ల కమిటీలు అవార్డులను ప్రకటించాయి. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జూన్ 14న అవార్డ్‌ల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై.. విజేతలకు పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి- హీరో అల్లు అర్జున్‌లు హైలైట్‌గా నిలిచారు.

తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్

పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంథ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఓ వివాహిత చనిపోగా.. ఆమె కుమారుడు చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి సంథ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. బెయిల్ రాకుంటే బన్నీ ఖచ్చితంగా జైలుకు వెళ్లేవాడే. బెయిల్‌పై విడుదలైన వెంటనే అల్లు అర్జున్ ఇంటికి టాలీవుడ్ మొత్తం క్యూకట్టడం, ప్రభుత్వంపై బన్నీ విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.

Telangana Gaddar Film Awards CM Revanth Reddy hugs Allu Arjun at Awards Presentation Ceremony

బన్నీ బలప్రదర్శనపై రేవంత్ సీరియస్
ఓ తల్లి ప్రాణాలు కోల్పోయి అక్కడ పడిఉంటే థియేటర్‌లోనే ఉన్న హీరో కనీసం ఏం జరిగిందనే పట్టించుకోకుండా వెళ్లిపోయాడని రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్‌ను పరామర్శించడానికి వెళ్లిన సెలబ్రెటీలలో ఒక్కరు కూడా చనిపోయిన రేవతిని కానీ, ఆసుపత్రిలో ఉన్న ఆమె కుమారుడిని గానీ పరామర్శించారా? అని సీఎం ప్రశ్నించారు. తాను తెలంగాణ సీఎంగా ఉన్నంత వరకు స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతించేది లేదని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. దీంతో ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు సినీ పెద్దలు రంగంలోకి దిగారు. ఈ పరిణామాలతో అల్లు అర్జున్ - రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ వచ్చింది.

అల్లు అర్జున్‌కి రేవంత్ రెడ్డి హగ్
ఇప్పుడు అదంతా గతం .. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్ధర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో పుష్ప 2 సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్‌ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేశారు. ఈ ప్రకటన ద్వారా తనకు అల్లు అర్జున్‌పై ద్వేషం కానీ, వ్యతిరేకత గానీ లేదని రేవంత్ రెడ్డి సంకేతాలిచ్చారు. ఇదే సినిమాకు గాను శ్రేయా ఘోషల్‌కు ఉత్తమ నేపథ్య గాయనీ పురస్కారం ప్రకటించారు. ఈలోగా అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమం రానే వచ్చింది. టాలీవుడ్ మొత్తం ఈ వేడుకకు కదిలిరాగా.. ఆ కాసేపటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికే బాలకృష్ణ, అల్లు అర్జున్‌లు మాట్లాడుకుంటూ ఉండగా సీఎం రాకతో వాళ్లిద్దరూ లేచి నిలబడ్డారు. బాలకృష్ణకు, బన్నీకి రేవంత్ హగ్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో సినీ జనాలు షాక్ అయ్యారు. రేవంత్- బన్నీల అలింగనం ఈ కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత వచ్చిన గ్యాప్ ఈ హగ్‌తో కవర్ అయిపోయింది.

Take a Poll

రేవంత్ రెడ్డి అన్నగారికి థ్యాంక్స్
అనంతరం వేదిక మీద అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడి పురస్కారం అందజేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. పుష్ప 2 సినిమాకు వచ్చిన తొలి అవార్డ్ ఇదేనని, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డ్ వేడుకను ఇలాగే కొనసాగించాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు. తన పురస్కారాన్ని అభిమానులకు అంకితమిస్తున్నట్లు చెప్పిన బన్నీ.. సీఎం రేవంత్ రెడ్డి అన్నగారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నిర్మాత దిల్‌రాజుకి థ్యాంక్స్ చెప్పారు. పుష్పను హిందీలో విడుదల చేయాలని రాజమౌళీ సూచించకపోయుంటే ఇంతటి ఆదరణ దక్కేది కాదని, ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అల్లు అర్జున్. అనంతరం రేవంత్ రెడ్డి అనుమతితో పుష్ప 2 సినిమాలోని నా బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా రప్పా రప్పా అనే డైలాగ్ చెప్పి అలరించారు బన్నీ. చిరిలో జై తెలంగాణ, జై హింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. మొత్తానికి అల్లు అర్జున్ - రేవంత్ రెడ్డిల కలయిక ఈ కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది.

More from Filmibeat

Read more about: cm revanth reddy allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X