Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తెలంగాణలో 7 షోలకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు ఎంతంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చిత్రం దేవర. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఆరేళ్ల తర్వాత రిలీజ్ అవుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై క్రేజ్ ఉండటంతో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో స్పెషల్ షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా స్పెషల్ షోలకు పర్మిషన్ ఇస్తూ.. టికెట్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది. దేవర సినిమా కోసం పెంచిన టికెట్ రేట్ల వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్రంలో మొదటి రోజు 7 షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. తాజా సర్కారు పర్మిషన్ ప్రకారం తెల్లవారు జామున 1 గంటకు స్పెషల్ మార్నింగ్ షో ప్రారంభం అవుతుంది. ఇక రెండో షో ఉదయం 4 గంటలకు మొదలవుతుంది. ఆ తర్వాత ఉదయం 8 గంటలకు నుంచి రెగ్యులర్ షోలు మొదలవుతాయి.

Telangana Government permits Devara ticket Rates hike and Special Shows in Nizam Region

ఇక తొలి రోజు సింగిల్ స్క్రీన్లలో 100 రూపాయలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాంతో తొలి రోజు మాత్రం సింగిల్ థియేటర్లలో 295 రూపాయలు, రెండో రోజు నుంచి 206 రూపాయల మేర ఉంటుంది. తొలి రోజు మాత్రం అధికంగా రేట్లను పెంచడం గమనార్హం.

ఇక మల్టీ ప్లెక్స్ విషయానికి వస్తే.. తొలి రోజు 413 రూపాయలుగా టికెట్ రేటును నిర్ణయించారు. ఇక రెండో రోజు నుంచి టికెట్ ధర 354 రూపాయలుగా నిర్ణయిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ వెసలుబాటును కలిగించింది. దాంతో ఈ సినిమా తొలి రోజు భారీగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Telangana Government permits Devara ticket Rates hike and Special Shows in Nizam Region

తెలంగాణ (నైజాం)లో దేవర సినిమాను ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌పై రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు చేసుకొన్న అభ్యర్థనకు సానుకూలంగా స్పందిస్తూ టికెట్ రేట్లు, మిడ్ నైట్ షోకు అనుమతి ఇచ్చింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో ఆనందం పొంగిపొర్లుతుంది.

RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఆచార్య మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

More from Filmibeat

Read more about: telangana devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X