Akhanda: ఆ థియేటర్లలో బెనిఫిట్ షోలకు అనుమతి.. రెండు రాష్ట్రాల్లో ముందు రిలీజ్ అయ్యేది అక్కడే

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని ప్రత్యేకమైన కాంబినేషన్లు ఉన్నాయి. అందులో సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయిక ఒకటి. దీనికి కారణం గతంలో వీళ్లిద్దరూ కలిసి చేసిన 'సింహా', 'లెజెండ్' చిత్రాలు ఒకదానికి మించి ఒకటి సూపర్ డూపర్ హిట్ అవడమే. ఈ చిత్రాల తర్వాత ఈ కాంబో కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి కలిసి చేసిన చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'అఖండ' మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సెకెండ్ వేవ్ తర్వాత ఈ మూవీ బ్యాలెన్స్ షూట్ మొత్తం పూర్తి చేశారు. ఈ క్రమంలోనే దీన్ని డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1600 థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. దీంతో నందమూరి అభిమానులు అప్పుడే సందడి మొదలుపెట్టేశారు. ఇప్పటికే థియేటర్లు మొత్తాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే, ఎక్కడికక్కడ ఫ్లెక్స్‌లు ఏర్పాటు చేశారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా సండది కనిపిస్తోంది.

Telangana Government permitted special screenings for Akhanda

ఇక, 'అఖండ' మూవీని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అందుకు అనుగుణంగా ఫ్యాన్స్ కూడా బెనిఫిట్ షోలు ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటికి అనుమతి ఇవ్వలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వానికి, సైబరాబాద్‌ పోలీసులకు కొన్ని థియేటర్ల యాజమాన్యాలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని లిఖిత పూర్వకంగా కోరారు. దీనిపై స్పందించిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర నందమూరి అభిమానులకు అదిరిపోయే కానుకను అందించారు.

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న మల్లికార్జున, భ్రమరాంభ థియేటర్లలో 'అఖండ' బెనిఫిట్ షోల ప్రదర్శనకు అనుమతి లభించింది. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ఆయా థియేటర్లలో డిసెంబర్ 2న ఉదయం 4:30 బాలయ్య మూవీని ప్రదర్శించబోతున్నారు. ఈ స్పెషల్ షోలకు టికెట్ రేట్లను పెంచుకోడానికి కూడా అనుమతి లభించింది. ఇక, ఇప్పటికే ఈ షోలకు సంబంధించిన టికెట్లు కూడా బుకింగ్ అయిపోయాయి. అంటే.. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా ఇక్కడే 'అఖండ' మూవీ ప్రదర్శన కాబోతుంది.

Telangana Government permitted special screenings for Akhanda

సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'అఖండ'లో నందమూరి బాలకృష్ణ అఘోరాగా, పవర్‌ఫుల్ రైతుగా రెండు పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తోంది. ఫ్యామిలీ హీరోగా పేరొందిన శ్రీకాంత్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా రూ. 53 కోట్ల వరకూ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X