గత ఇరవై ఏళ్లలో కాలా, సైరా.. ప్రతీ ఒక్క భారతీయుడు చూడాల్సిన చిత్రం.. గవర్నర్ ప్రశంసలు

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ ఇప్పటికే వందకోట్లను దాటేసి.. రెండు వంద కోట్ల వైపు పరిగెడుతోంది.

తొలి స్వతంత్ర్య సమరయోధుడు, రేనాటి వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన సైరా మూవీని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేశారు. దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. అక్టోబర్ 2న విడుదలైన ఈ మూవీ.. తెలుగు నాట వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.

Telangana Governor Shri Tamilisai watched Sye Raa

అయితే ఇంతటి ఘన విజయం సాధించిన ఈ మూవీని చూడాలంటూ గవర్నర్‌ తమిళిపై సౌందరరాజన్‌ను మెగాస్టార్ చిరంజీవి కోరిన సంగతి తెలిసిందే. అయితే నేడు గవర్నర్ తమ కుటుంబ సభ్యులందరితో కలిసి సినిమా చూశారు. ఈ చిత్రం తనకెంతో నచ్చిందని, చిరంజీవి నటన, క్యాస్టూమ్స్, విజువల్స్ అన్నీ బాగున్నాయని, మాటల్లో చెప్పలేమంటూ.. నా బ్రదర్ చిరంజీవి.. చిరంజీవిగా ఉండాలంటూ చిత్ర యూనిట్ మొత్తాన్ని ప్రశంసించారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. 'గత ఇరవై ఏళ్లలో నేను చూసింది రెండు సినిమాలే... అవి కాలా, సైరా. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో దక్షిణ భారతదేశ పాత్ర ఎలాంటిదో సైరా నిరూపించింది. తన వెంటే నమ్మిన బంటులా ఉండే రాజా పాండీ క్యారెక్టర్‌తో తెలుగు, తమిళుల మధ్య ఉన్న సోదర భావం ఎలాంటిదో మరోసారి చూపించారు. ప్రతీ ఒక్క భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రమిది. ఈ సినిమాను ఇంత అద్భుతంగా బయటకు తీసుకొచ్చేందుకు చిరంజీవి పడిన కష్టాన్ని తప్పక అభినందించాలి' అంటూ ట్వీట్ చేసింది.

ఏడో రోజూ సైరా అప్రతిహతంగా దూసుకుపోతోంది. గోసాయి వెంకన్నగా అమితాబ్, అవుకు రాజుగా కిచ్చా సుదీప్, వీరా రెడ్డిగా జగపతి బాబు, లక్ష్మీగా తమన్నా పాత్రలకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X